Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్‌ని ఈటల అభివృద్ది చేశారు.. కానీ ఎవరి వల్ల : తలసాని శ్రీనివాస్ యాదవ్

హుజురాబాద్‌ని అభివృద్ధి చేశానని ఈటల రాజేందర్ (etela rajender) అన్నారని.. కానీ అది ఎవరి కాలంలో చేశారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ఈ జిల్లా మంత్రిగా, కేసీఆర్ నాయకత్వంలోనే ఈ కార్యక్రమాలు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు

minister talasani srinivas yadav slams bjp leaders
Author
Hyderabad, First Published Oct 27, 2021, 1:34 PM IST

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం, బీజేపీలపై మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (srinivas Yadav). హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన రోడ్ షోలో మాట్లాడుతూ.. బండి సంజయ్ (bandi sanjay) చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు ఎంపీ అయిన తర్వాత ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టావా అని బండి సంజయ్‌ని తలసాని ప్రశ్నించారు. హుజురాబాద్, జమ్మికుంటలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. 

తాను హుజురాబాద్‌ని అభివృద్ధి చేశానని ఈటల రాజేందర్ (etela rajender) అన్నారని.. కానీ అది ఎవరి కాలంలో చేశారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ఈ జిల్లా మంత్రిగా, కేసీఆర్ నాయకత్వంలోనే ఈ కార్యక్రమాలు చేశారని తలసాని చెప్పారు. రైతు బీమా , 24 గంటల కరెంట్, కళ్యాణ లక్ష్మీ వంటి కార్యక్రమాలు ఏడేళ్లుగా జరుగుతున్నాయని మంత్రి గుర్తుచేశారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే.. ఏదైనా పని మీద ఆయన వద్దకు వెళితే నా చేతుల్లో ఏం లేదని, కేసీఆర్ చేతుల్లోనే వుందని మాట్లాడతారని తలసాని ఆరోపించారు. నిరుద్యోగ యువకుల్ని కూడా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని.. కానీ లక్షా 14 వేల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేసేందుకు యత్నిస్తున్న కేసీఆర్‌దేనని (kcr) శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 

ALso Read:huzurabad bypoll: ఓటర్లకు డబ్బు పంపిణీ కలకలం.. ఓటుకు రూ. 8 వేలు, వీడియో వైరల్

కాగా.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో (huzurabad bypoll) డబ్బులు పంపిణీ అన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక ఓటుకు రూ.6 వేల చొప్పున పంపణీ చేస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. కమలాపూర్‌లో (kamalapur) కవర్‌పై ఓటర్ల నెంబర్ వేసి నగదు పంపిణీ చేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. హుజురాబాద్‌లో సైతం ఓటర్‌కు రూ.6 నుంచి రూ8 వేలు పంపిణీ జరిగినట్లుగా సమాచారం. ఖర్చుకు తగ్గకుండా ఆయా పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా చర్చించుకుంటున్నారు. పంపిణీకి సిద్ధంగా వున్న కవర్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు వాడివేడిగా సాగుతున్న హుజురాబాద్‌ ఉపఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. మరి కొన్నిగంటలే ప్రచారానికి సమయం ఉండడంతో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. ఈ ఉపఎన్నికలో గెల్చి, మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈటల గెలుపుతో ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే, చాపకింద నీరులా హస్తం పార్టీ ప్రచారం సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios