Asianet News TeluguAsianet News Telugu

huzurabad bypoll: ఓటర్లకు డబ్బు పంపిణీ కలకలం.. ఓటుకు రూ. 8 వేలు, వీడియో వైరల్

హుజురాబాద్ ఉపఎన్నికల్లో (huzurabad bypoll) డబ్బులు పంపిణీ అన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక ఓటుకు రూ.6 వేల చొప్పున పంపణీ చేస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. కమలాపూర్‌లో (kamalapur) కవర్‌పై ఓటర్ల నెంబర్ వేసి నగదు పంపిణీ చేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. 

parties distribute money to voters in huzurabad video goes viral
Author
Huzurabad, First Published Oct 27, 2021, 11:59 AM IST

హుజురాబాద్ ఉపఎన్నికల్లో (huzurabad bypoll) డబ్బులు పంపిణీ అన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక ఓటుకు రూ.6 వేల చొప్పున పంపణీ చేస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. కమలాపూర్‌లో (kamalapur) కవర్‌పై ఓటర్ల నెంబర్ వేసి నగదు పంపిణీ చేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. హుజురాబాద్‌లో సైతం ఓటర్‌కు రూ.6 నుంచి రూ8 వేలు పంపిణీ జరిగినట్లుగా సమాచారం. ఖర్చుకు తగ్గకుండా ఆయా పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా చర్చించుకుంటున్నారు.  పంపిణీకి సిద్ధంగా వున్న కవర్ల వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

కాగా.. వాడివేడిగా సాగుతున్న హుజురాబాద్‌ ఉపఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. మరి కొన్నిగంటలే ప్రచారానికి సమయం ఉండడంతో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. ఈ ఉపఎన్నికలో గెల్చి, మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈటల గెలుపుతో ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే, చాపకింద నీరులా హస్తం పార్టీ ప్రచారం సాగుతోంది. 

ALso Read:Huzurabad bypoll: రెండు గంటలు పోలింగ్ సమయం పెంపు, భారీగా ఓటింగ్‌కి చాన్స్

టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈనెల 8 వరకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలనతో పాటు ఉపసంహరణకు ఈ రోజు వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 30న పోలింగ్‌ జరగనుండగా నవంబర్‌ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios