రాజకీయాల్లో ఎన్టీఆర్ నాటిన మొక్కలే నేడు చెట్లయ్యాాయి: ఎన్టీఆర్ కు తలసాని నివాళులు


హైద్రాబాద్  ఎన్టీఆర్ ఘాట్ లో  తెలంగాణ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  ఇవాళ  నివాళులర్పించారు.  ఎేన్టీఆర్ తో  తనకు  ఉన్న  అనుబంధాన్ని  ఆయన గుర్తు  చేసుకున్నారు. 

minister  Talasani Srinivas  Yadav  Pays Tribute to  NTR lns

హైదరాబాద్: రాజకీయంగా  ఎన్టీఆర్ నాటిన మొక్కలే  నేడు చెట్లుగా మారాయని  తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  చెప్పారు. ఆదివారంనాడు  హైద్రాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో  ఎన్టీఆర్ సమాధికి మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్  నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడారు.యువతకు  ఎన్టీఆర్ రాజకీయంగా  అవకాశం కల్పించారని ఆయన గుర్తు  చేశారు. విద్యావంతులు  రాజకీయాల్లోకి రావాలని  ఎన్టీఆర్ నాడు పిలుపునిచ్చారనన్నారు.  ఎన్టీఆర్ పిలుపు మేరకు ఎందరో  నాడు  రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్ గుర్తు  చేసుకున్నారు. 

తెలుగు జాతి జాతిరత్నం  ఎన్టీఆర్ అని   మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చెప్పారు.  సినీ రంగంలో  ఎన్టీఆర్ రారాజుగా  వెలుగొందారన్నారు.   రాజకీయరంగ ప్రవేశం చేసి  9 మాసాల్లోనే  టీడీపని అధికారంోకి తీసుకురావడంలో  ఎన్టీఆర్ కృషిని ఎవరూ కూడా మరువలేరన్నారు. 

జాతీయ  రాజకీయాల్లో కూడా  ఎన్టీఆర్  చక్రం తిప్పిన  విషయాన్ని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించారు.  తాను    ఎన్టీఆర్ అభిమానిని అని మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్   చెప్పారు.ఎన్టీఆర్   శత జయంతి ఉత్సవాలు  .  ప్రపంచవ్యాప్తంగా  ఘనంగా  జరుగుతున్నాయన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios