భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: గణేష్ శోభాయాత్రను పరిశీలించిన తలసాని
హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ లో బోటులో పర్యటించి వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని మంత్రి తిలకించారు. మంత్రితో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బోటులో పర్యటించి వినాయక నిమజ్జనాన్ని పరిశీలించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్రను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు ఉదయం వరకు వినాయక విగ్రహాల నిమజ్జనం సాగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఖైరతాబాద్ వినాయక విగ్రహాం నిమజ్జనం త్వరగా పూర్తి చేస్తే ఇతర విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులుండవని మంత్రి తెలిపారు.హైద్రాబాద్ లోని పలు చెరువులు, కొలనుల్లో లక్షకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.
హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, రాంపూర్, కాప్రా, సఫిల్ గూడ చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది.ఎక్కువగా హుస్సేన్ సాగర్ లో ఎక్కువ వినాయక విగ్రహాల నిమజ్జనం సాగుతుంది. ఆ తర్వాతి స్థానంలో సరూర్ నగర్ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం సాగనుంది.
also read:రేపు ఉదయం వరకు గణేష్ విగ్రహాల శోభాయాత్ర: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
ఈ ఏడాది ఖైరతాబాద్ విగ్రహాన్ని త్వరగా నిమజ్జనం చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆరు గంటలలోపుగానే పూజలు పూర్తి చేశారు. ఆరు గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది.హైద్రాబాద్ నగరంలో సుమారు 19 కి.మీ. పాటు శోభాయాత్ర సాగనుంది. ఈ 19 కి.మీ. పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 40 వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా కొనసాగుతుంది.