Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్ట్ బాధాకరం.. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు: మంత్రి తలసాని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు  అరెస్ట్ బాధకరమని తలసాని పేర్కొన్నారు.

minister talasani srinivas yadav condemn Chandrababu Arrest and says its painful to me ksm
Author
First Published Oct 4, 2023, 4:35 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు  అరెస్ట్ బాధకరమని తలసాని పేర్కొన్నారు. ఈ మేరకు తలసాని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రిగా పని చేశాను.. వారి అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసిందని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదు.. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడని అన్నారు. చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమని పేర్కొన్నారు. 

సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం..  విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. 
 

 

అయితే చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణలోని  పలువురు రాజకీయ నాయకులు ఖండించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్‌లోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించగా.. ముఖ్య నేతలు మాత్రం తొలుత స్పందించేందుకు నిరాకరించారు. ఇక, కొద్దిరోజుల క్రితం కేటీఆర్ స్పందిస్తూ.. చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీకి సంబంధించినదని, తమకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో ర్యాలీలు తీస్తున్నారని అన్నారు. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అని అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదనే ర్యాలీలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏపీ రాజకీయాలు అంటించొద్దని అన్నారు. 

అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు కొందరు చంద్రబాబు  అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే రానున్న ఎన్నికల్లో సెటిలర్ల ఓట్ల కోసమే కొందరు బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టుగా ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios