నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై కట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నెక్లెస్ రోడ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై రూ.25 వేలు జరిమానా విధించింది.