ప్రగతినివేదన సభ ఫెయిల్ అయ్యిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభపై జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్: ప్రగతినివేదన సభ ఫెయిల్ అయ్యిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభపై జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభకు వచ్చిన జనం కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. సభలో కేసీఆర్ తిట్టకపోయేసరికి కాంగ్రెస్ నేతలు నిరాశపడ్డారన్నారు. 

జోన్ల విషయంలో సీఎం కేసీఆర్ గొప్ప విజయం సాధించారని మంత్రి అభిప్రాయపడ్డారు. నా రాజకీయ జీవిత చరిత్రలో ఇంతటిపెద్ద సభ ఎప్పుడూ చూడలేదన్న తలసాని సభ విజయవంతమైందో లేదో కాంగ్రెస్ నేతలు కంటి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్ నేతలకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.