మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర గతంలో పీఏగా పనిచేసిన వ్యక్తి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలు దారి తీస్తోంది. అతని మీద క్రిమినల్ కేసులు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ : గచ్చిబౌలిలో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు రాజధానిలో కలకలం రేపుతోంది. ఆ యువకుడు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర గతంలో పీఏగా పనిచేసిన దేవేందర్ కొడుకు. అతని పేరు అక్షయ్ కుమార్. అతను ఇప్పుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మరణం ఇప్పుడు అనుమానాలను రేకెత్తిస్తోంది. అక్షయ్ కుమార్ హైదరాబాద్ కొండాపూర్ సెంట్రల్ పార్క్ లో నివాసముంటున్నాడు. అక్కడే తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరులేని టైంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఐతే, అక్షయ్ కుమార్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అక్షయ్ కుమార్ తండ్రి గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర పీఏగా పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు చెలరేగాయి.
ఈ మేరకు ఆత్మహత్యకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న అక్షయ్.. పది రోజుల క్రితమే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతే కాదు, అక్షయ్ పై ఓ క్రిమినల్ కేసు కూడా ఉందని వెల్లడించారు. అయితే, అక్షయ్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటో ఈ బయటికి రాలేదు.
మంత్రి మల్లారెడ్డి ఇళ్లల్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో తనిఖీలు...
ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. దీంతో ఈ కేసును అనుమానాస్పద మృతిగా బావించి.. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్షయ్ పై అనేక ఆరోపణలు వినిపిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ తండ్రి.. మంత్రి దగ్గర పీఏగా పని చేసినప్పుడు మోసాలకు పాల్పడినట్లు టాక్ ఉంది. ఆ నేరాల్లో నమోదైన కేసు కారణంగానే అక్షయ్ కుమార్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
