సారాంశం

పనిగట్టుకుని తనపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారని.. చివరికి న్యాయం, ధర్మమే గెలిచిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మళ్లీ గెలుపు తనదేనని, ప్రజలు తనవైపే వున్నారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ పిటిషన్‌పై హైకోర్ట్ మంగళవారం తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పనిగట్టుకుని తనపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారని.. చివరికి న్యాయం, ధర్మమే గెలిచిందని మంత్రి చెప్పారు. తన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని.. మళ్లీ గెలుపు తనదేనని, ప్రజలు తనవైపే వున్నారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రజలకు మరింత సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు. 

కాగా, 2019లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చేయలేదంటూ మహబూబ్నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫీడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మొదట రిటర్నింగ్ అధికారికి అఫిడవిటిను సమర్పించి... మళ్ళీ వెనక్కి తీసుకున్నారని..  ఆ తర్వాత సవరించి ఇచ్చారని ఆరోపించారు.

Also Read : మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో ఊరట..ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ కొట్టివేత..

ఇలా చేయడం టాంపరింగ్ కిందికి వస్తుందని.. చట్టవిరుద్ధమని..  మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషనర్ రాఘవేంద్ర రాజు హైకోర్టును కోరారు. దీని మీద విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు  ఈ వివాదం మీద తీర్పును నేటికి వాయిదా వేసింది. దీని మీద విచారణ చేసిన హైకోర్టు మంగళవారం నాడు  పిటిషన్ను కొట్టివేసింది.