విదేశాల్లో స్థిరపడ్డవారు తిరిగొస్తున్నారు.. కేసీఆర్ వల్లే ఇదంతా: హుజురాబాద్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్
హుజురాబాద్ (huzurabad bypoll) ప్రజలు ఎవరికి ఓటు వేయాలి.. ఎందుకు ఓటు వేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud). తెలంగాణలో అన్ని కులాలకు రక్షణ ఉందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టేనని శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.
హుజురాబాద్ (huzurabad bypoll) ప్రజలు ఎవరికి ఓటు వేయాలి.. ఎందుకు ఓటు వేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud). గురువారం హుజురాబాద్‌లోని టీఆర్ఎస్ (trs) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ,దేశాన్ని పరిపాలించిన పార్టీలు తెలంగాణ కంటే వేరే రాష్ట్రంలో ఏమయినా అభివృద్ధి చేశాయా అని మంత్రి ప్రశ్నించారు. బిజెపి (bjp) పాలిత రాష్ట్రాలలో ఏదైనా రాష్ట్రం ముందుందా అని నిలదీశారు. బిజెపి తెలంగాణ ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ఇచ్చిందా.. ప్రభుత్వ రంగ సంస్థలన్ని ప్రైవేట్ పరం అయితే రిజర్వేషన్ ఎక్కడ ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు.
హుజురాబాద్‌లో బిజెపి గెలిస్తే ఉద్యోగాలు, ప్రాజెక్టులు ఇస్తారా అని ఆయన నిలదీశారు. హుజురాబాద్‌లో ఒక్క బీసీ భవన్ (bc bhavan) కూడా ఈటల రాజేందర్ కట్టించలేదని మంత్రి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ వల్ల ఈటల రాజేందర్‌కు రెండో హోదా వచ్చిందని.. హుజూరాబాద్‌లో సెకండ్ కేడర్ నాయకులను ఈటల రాజేందర్ ఎందుకు తయారు చేయలేదని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్‌లో ఒక స్థాయికి వచ్చి ఆ పార్టీనీ, ఆ పార్టీ నాయకుణ్ణి విమర్శించడం సరికాదని మంత్రి హితవు పలికారు. హైదరాబాద్‌లో అన్ని కులాలకు భవనాలు ఇచ్చిన ఘనత సిఎం కేసీఆర్‌దేనని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు.
బిజెపి ఢిల్లీలో ఒక్క బీసీభవన్ కూడా కట్టలేదంటూ మంత్రి దుయ్యబట్టారు. తెలంగాణలో అన్ని కులాలకు రక్షణ ఉందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టేనని శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. తెలంగాణ వచ్చాక ఇతర దేశాలకు వెళ్ళాలని అలోచిండం లేదని, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు తెలంగాణకు వద్దాం అనుకుంటున్నారని మంత్రి తెలిపారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పేద వర్గాలకు చెందిన గెల్లు శ్రీనివాస్‌ను (gellu srinivas yadav) అన్ని వర్గాలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Also Read:గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసి విజయగర్జన సభకు తరలిరండి: కేటీఆర్
కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు.
హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈనెల 8 వరకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలనతో పాటు ఉపసంహరణకు ఈ రోజు వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. ఉపపోరుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారికి నిబంధనలను వివరించారు.
"