హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని అక్షయ్ గుర్తించారు.

హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని అక్షయ్ గుర్తించారు. అక్షయ్ తండ్రి దేవేంద్ర తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద పీఏగా పనిచేస్తున్నారు. అయితే మహబూబ్‌ నగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అక్రమ వసూళ్ల కేసులో ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లిన అక్షయ్.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఈ రోజు కొండాపూర్ సెంటర్ పార్క్ కాలనీలో నివాసం ఉంటున్న అక్షయ్.. ఇంట్లోని తన గదిలో అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టమ్ నిమిత్తం అక్షయ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్షయ్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక, అక్షయ్ గతంలో మహబూబ్ నగర్ జిల్లాలోనే ఓ ఏమ్మార్వో ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసినట్టుగా తెలుస్తోంది. అయితే డబుల్ బెడ్ రూమ్ అక్రమ వసూళ్లకు సంబంధించి అక్షయ్‌‌ను ఎవరైనా బెదిరింపులకు గురిచేశారా?.. లేక జైలుకు వెళ్లి వచ్చాననే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.