Asianet News TeluguAsianet News Telugu

ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ వివాదం: ఏపీకి కేసీఆర్ కౌంటరిస్తారు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌లో ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఏపీ చేపడుతున్న కాలువ నిర్మాణ పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ కృష్ణా రివర్ బోర్డ్ నుంచి గానీ అనుమతులు లేకుండా ఏపీ కుడి కాలువ నిర్మాణ పనులు చేపట్టిందని ఆయన ఆరోపించారు

minister srinivas goud fires on ap govt over rds head regulator issue ksp
Author
Hyderabad, First Published Jun 16, 2021, 5:43 PM IST

మహబూబ్‌నగర్‌లో ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఏపీ చేపడుతున్న కాలువ నిర్మాణ పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ కృష్ణా రివర్ బోర్డ్ నుంచి గానీ అనుమతులు లేకుండా ఏపీ కుడి కాలువ నిర్మాణ పనులు చేపట్టిందని ఆయన ఆరోపించారు. కుడికాలువ నిర్మాణం వల్ల తెలంగాణలోని అలంపురం ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని మంత్రి చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్ తగిన చర్యలు తీసుకుంటారని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఏపీ చేపట్టిన పనుల్ని ఆపేందుకు చర్యల్ని చేపడతారని మంత్రి వెల్లడించారు.

Also Read:పోతిరెడ్డిపాడు: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ కీలక ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios