Asianet News TeluguAsianet News Telugu

పుట్టుకలు మాత్రమే తెలంగాణవి... వారి ఆత్మలు ఆంధ్రావి: కాంగ్రెస్ నేతలపై వ్యవసాయ మంత్రి ఫైర్

మహబూబ్ నగర్ లో నిరుద్యోగ జంగ్ సైరన్ సభలో అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసారు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి. 

minister singireddy niranjan reddy fires on congress leaders
Author
Mahabubnagar, First Published Oct 13, 2021, 5:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మహబూబ్ నగర్: నిరుద్యోగ జంగ్ సైరన్ బహిరంగ సభలో అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై పాలమూరు జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు బతుకుల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ కు సిగ్గుండాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని శ్రీ కృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని నిరంజన్ రెడ్డి గుర్తుచేసారు. 

''2014 కు ముందు పాలమూరులో లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. 87 వేల ఎకరాలకు పారాల్సిన ఆర్డీఎస్ నీటిని క్రమక్రమంగా 20 వేలకు కుదించారు. జూరాల నిర్మాణం 36 ఏళ్లు సాగదీశారు.. కర్ణాటకకు రూ.70 కోట్లు పరిహారం ఇవ్వాలని జూరాలను నిండుగా నింపలేదు. ఉద్యమంలో నిలదీస్తే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పరిహారం చెల్లించారు. పాలమూరుకు కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో ప్రస్తుత PCC అధ్యక్షుడుగా వున్న revanth reddy టీడీపీలో ఉన్నప్పుడు వందల సార్లు చెప్పాడు'' అని మంత్రి పేర్కొన్నారు.

''palamuru కొత్తగా నీళ్లొచ్చిన ఏ ఊరిలో ఎవరిని అడిగినా చెబుతారు సాగు నీళ్లు ఎవరు తెచ్చారో.  కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 2014 నాటికి లిఫ్ట్ 1 కింద 13 వేల ఎకరాలకు మాత్రమే నీరు వచ్చాయి. లిఫ్ట్ 2, లిఫ్ట్ 3 లను 2014 తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటబడి పూర్తి చేశాం. 2014 నుండి దాదాపు 70 సార్లకు పైగా నేను స్వయంగా పర్యటించి పనుల పూర్తికోసం అధికారుల వెంటపడ్డాం. ప్రాజెక్టుల వద్ద నిద్రలు చేశాం'' అని వ్యవసాయ singireddy niranjan reddy  అన్నారు.

''పాలమూరు ఎత్తిపోతల మీద కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ నేతలే ఇప్పుడు పనులు కాలేదని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రలో జగన్, చంద్రబాబుల మధ్య ఎంత విరోధం ఉన్నా ప్రాజెక్టులను అడ్డుకోలేదు... కేసులు వేయలేదు. కానీ తెలంగాణ ప్రాంత విపక్ష నేతలకు ఎన్ని సార్లు వేడుకున్నా వినడంలేదు. ప్రాజెక్టులపై కేసులు వేయడం వారి అక్కసుకు నిదర్శనం'' అని మండిపడ్డారు. 

READ MORE  నవంబర్ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన సభ:కేటీఆర్

''తెలంగాణ రాష్ట్రం కోసమే శ్రీకాంతచారి ఆత్మార్పణం చేసుకున్నాడు. అలాంటి శ్రీకాంతచారి ఫోటోలను వాడుకోవడం, ఆయన విగ్రహానికి కాంగ్రెస్ దండ వేయాలనుకోవడం దౌర్భాగ్యం. కేసీఆర్ అధికారంలో ఉన్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. దేశంలోని మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీలే ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలోనయినా KCR మాదిరిగా పథకాలు, పాలన అమలు చేసి చూపండి'' అని నిరంజన్ రెడ్డి సూచించారు. 

''ఉద్యోగాల గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం గువ్వొచ్చి గుడ్లు పెట్టినట్లుంది. మరుగున పడిన తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుని ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్. దేశంలోని ఏ రాష్ట్రం అయినా ఏ అంశంలో అయినా పోటీ పడగలదేమో చర్చకు సిద్దమా?'' అని మంత్రి సవాల్ విసిరారు. 

''గతంలో వైఎస్ మెప్పు కోసం పోతిరెడ్డిపాడు నీళ్లకు అనుకూలంగా వ్యాసాలు రాసినోళ్లు పాలమూరుకు నీళ్లు తెచ్చామనడం సిగ్గుచేటు. అరుపులు, కేకలతో అధికారం దక్కుతుందని అనుకోవడం అవివేకం. తెలంగాణ ఎల్లలు తెల్వనోళ్లు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ జలవనరుల మీద కేంద్రం పెత్తనానికి సిద్దమవుతుంది. ఈ అంశం మీద సోనియా, రాహుల్ ఎందుకు మాట్లాడరు? మీరు పార్లమెంటులో ఎందుకు లేవనెత్తరు? కేసీఆర్ ను తిట్టడమే మీ ఎజెండానా? జాతీయ పార్టీ దిక్కుమాలిన విధానానికి ఇది నిదర్శనం'' అని మండిపడ్డారు.

READ MORE  కేటీఆర్‌తో డిఎంకె ఎంపీల భేటీ: నీట్ రద్దుపై స్టాలిన్ లేఖ అందజేత

''ఉమ్మడి పాలమూరు జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించి పాలమూరును వికేంద్రీకరించాం. 60 ఏండ్లలో పాలమూరుకు ఒక్క ఇంజనీరింగ్ కళాశాల ఇవ్వ చేతకాలేదు. కానీ నేడు రెండు మెడికల్, ఒక మత్స్య కళాశాలల ఏర్పాటు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో పేరుకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు.తెలంగాణ వర్శిటీకి నిధుల కోసం కొట్లాడితే రూ.3 కోట్లు ఇచ్చారు.అదే కడప యోగి వేమన యూనివర్శిటీకి రూ.300 కోట్లు ఇచ్చారు'' అని గుర్తుచేశారు.

''తెలంగాణ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతుంటే విద్యార్థులను రెచ్చగొట్టడమే పనిగా కొందరు పనిచేస్తున్నారు. అలాంటివారిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు'' అని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios