టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో డిఎంకె ఎంపీలు బుధవారం నాడు తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను కేటీఆర్ కు అందించారు డిఎంకె ఎంపీలు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవడం లేదని డీఎంకె ఆరోపించింది. ఈ విషయాలపై కేంద్రంపై పోరాటం చేసేందుకు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొంటున్నామని dmk ఎంపీలు చెప్పారు.

also read:నీట్ ఎస్ఎస్ 2021 ఎగ్జామ్ ప్యాటర్న్ లో మార్పు.. కేంద్రం, ఎంసిఐ నుంచి స్పందన కోరిన సుప్రీం కోర్టు..

డీఎంకెకు చెందిన ఎంపీలు బుధవారం నాడు హైద్రాబాద్ తెలంగాణ భవన్ లో trs వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి ktr‌తో భేటీ అయ్యారు.తమిళనాడు సీఎం stalin రాసిన లేఖను డీఎంకె ఎంపీలు కేటీఆర్ కు అందించారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ స్టాలిన్ పలు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడు.ఈ లేఖను కేటీఆర్ కు అందించారు డీఎంకె ఎంపీలు.

డీఎంకెకు చెందిన ఎంపీలు ఇళగోవన్, కళానిధి వీరస్వామి తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయమై పలు రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖ రాశారు.

రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రం తీసుకొంటున్న చర్యలపై పోరాటం చేయాలని స్ఠాలిన్ భావిస్తున్నారు.ఈ మేరకు ఈ పోరాటానికి కలిసి రావాలని టీఆర్ఎస్‌ను కోరినట్టుగా డీఎంకె ఎంపీ ఇళగోవన్ మీడియాకు చెప్పారు.neet ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశాడని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో రాష్ట్రాలకు వచ్చే పన్నులను తీసుకొందన్నారు. మరో వైపు పెట్రోల్, డీజీల్ పై కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని తీసుకొనే ప్రయత్నం చేయడాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలే తీవ్రంగా వ్యతిరేకించాయని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.