Asianet News TeluguAsianet News Telugu

Telangana : సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేసారు.  ఇప్పట్లో సర్పంచ్ ల ఎన్నిక  సాధ్యంకాదని క్లారిటీ ఇచ్చారు. 

Minister Seethakka given clarity on Sarpanch Elections in Telangana AKP
Author
First Published Jan 25, 2024, 11:36 AM IST | Last Updated Jan 25, 2024, 11:41 AM IST

వేములవాడ : తెలంగాణ గ్రామ పంచాయితీ పాలకవర్గాల కాలపరిమితి ఈ నెలతో ముగియనుంది. ఈలోపు పంచాయితీ ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటుచేయాల్సి  వుంటుంది... కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో సాధ్యంకాదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 

ప్రస్తుత సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన తర్వాత  గ్రామ పంచాయితీలు ప్రత్యేక అధికారుల పాలన మొదలయ్యే అవకాశాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించన్నారు. ఇలా నూతనంగా ఎన్నికయ్యే పాలకవర్గాలకు పంచాయితీల పాలన బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం వున్నట్లు మంత్రి సీతక్క మాటలను బట్టి అర్థమవుతోంది. 

Also Read  ప్రతిపక్షంలో బుద్దిగా పని చేయ్ కేటీఆర్ - మంత్రి సీతక్క ఫైర్

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత అదే ఊపులో పంచాయితీ ఎన్నికలు కూడా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఇందుకోసం కొంత కసరత్తు కూడా చేసింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలని భావించిన అది సాధ్యపడలేదు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ సాధ్యపడదని అర్థమై ప్రభుత్వం వెనక్కితగ్గింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios