ముునుగోడులో సైతం చెప్పులు లేకుండానే ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఇంటింటికి విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసీఆర్ మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతూ... మంత్రి సత్యవతి రాథోడ్ దీక్ష మొదలుపెట్టారు. ఆయన మరోసారి సీఎం అయ్యేంత వరకు తాను పాదరక్షలు ధరించనంటూ ఆమె మొక్కుకోవడం గమనార్హం.
మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోగ్య రీత్యా వైద్యులు చెప్పులు ధరించాలని సూచించినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా సీఎం కేసీఆర్ గారి కోసం మంత్రి సత్యవతిరాథోడ్ తన దీక్షను కొనసాగిస్తుండటం విశేషం.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో... ముునుగోడులో సైతం చెప్పులు లేకుండానే ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఇంటింటికి విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తండాలు మారుమూల గ్రామాల్లో సైతం రాళ్లలో, ముళ్ళల్లో, వాగులు, వంకలు నీటితో ప్రవహిస్తున్న లెక్కచేయకుండా చెప్పులు లేకుండానే ప్రచారంలో పాల్గొనడం... అందరినీ షాకింగ్ కి గురిచేసింది. సీఎం కేసీఆర్ కోసం మంత్రి ఏకంగా చెప్పులు వేసుకోకుండా ఉండడం చాలా గొప్ప విషయం అంటూ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
గతంలో ఏ నాయకుడు చేయని విధంగా, దేశానికే ఆదర్శనీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన సాగుతుందని, ప్రతిఇంటికి ప్రభుత్వం పక్షాన సంక్షేమఫలాలు అందుతున్నాయని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఈ రాష్ట్రంలో గిరిజనులతో పాటు, అన్ని వర్గాలకు, శ్రీరామ రక్ష మన సీఎం కేసీఆర్ మాత్రమే అని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే ఒకే ఒక నాయకుడు సీఎం కేసీఆర్ అని అతని కోసం ఎంత చేసిన తక్కువేనని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
ప్రాణాలు సైతం లెక్క చేయకుండా..తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాదించిన ఉద్యమనాయకుడు కేసీఆర్ అని, అలాంటి నేత సీఎం గా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి లో మరింత ముందుకు పోతుందని, ఆ..ఆలోచనతోనే తన వంతుగా ఈ..చిన్న దీక్షను చేపట్టానని ఆమె అన్నారు. తెలంగాణ సాదించిన దేవుడి కోసం దేవుణ్ణి మొక్కుకోవడం చాలా గొప్ప విషయంగానే తాను బావిస్తానని ఆమె అన్నారు.
