Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి చైత్ర హత్యాచార నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. సత్యవతి రాథోడ్

 ఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రోజూ డీజీపీ సీపీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. పది పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని, కచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

minister satyavathi rathod comments on sadabad rape case
Author
Hyderabad, First Published Sep 15, 2021, 2:57 PM IST

హైదరాబాదు లోని సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్ర పై అత్యాచారం చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్  అన్నారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రోజూ డీజీపీ సీపీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. పది పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని, కచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మాణం పనులు, మెడికల్ కాలేజ్ కి కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ పరిశీలించారు. 
 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... మహబూబాబాద్ మెడికల్ కాలేజీ కార్యరూపం దాల్చడంలో నేను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. అధికారులు అంతా ప్రత్యేక శ్రద్ధ  పెట్టారని కొనియాడారు. నిర్మాణ పనులు త్వరగా కావాలని ఆర్ అండ్ బి కి అప్పగించామని చెప్పారు. 

రూ.30 కోట్లతో నర్సింగ్ కాలేజీకి టెండర్ పూర్తి అయ్యిందని, నర్సింగ్ కాలేజీ పూర్తి చేశాక అందులో ముందు మెడికల్ కాలేజీ నడిపిస్తాం. ఏరియా హాస్పిటల్ లో 300 పడకల ఏర్పాటు చేశాం. అన్ని సర్విసులు అక్కడ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. 

సీఎం కేసిఆర్ గారి చేతుల మీదుగా మెడికల్ కాలేజీ శంకుస్థాపన, నర్సింగ్ కాలేజీ, కొత్త కలెక్టర్ కార్యాలయం ప్రారంభం చేయడానికి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయం వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం సులువుగా అందుతాయన్నారు. 33 ప్రభుత్వ కార్యాలయాలు ఒకే దగ్గర ఉంటాయని చెప్పుకొచ్చారు. 

సైదాబాద్ బాలికపై రేప్, హత్య: బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల, పవన్

మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిలో మీడియా సహకారం కావాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. మహబూబాబాద్ లో 3000 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి  ఉండేది. కొంత ప్రభుత్వ భూమిని పేదలకు అసైన్డ్ చేశాం. భూములలో ఉన్న వారికి న్యాయం చేస్తాం. రికార్డులు లేని వారికే ఇబ్బంది అవుతుంది. అయినా ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 

మహబూబాబాద్ అత్యధిక గిరిజనులు ఉన్న జిల్లా ఇది. ఇక్కడ సీఎం కేసిఆర్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ రావడంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం రానుంది.ఈ క్రమంలో ఎవరికీ ఇబ్బంది అయినా వారికి నష్టం లేకుండా చూస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జెడ్పి చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఆర్ అండ్ బి పి ఎం సి గణపతి రెడ్డి, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, , జిల్లా కలెక్టర్ శంకర్ ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఏఎస్పి గౌతమ్ కలెక్టర్ కొమురయ్య, ఎస్. ఈ నాగేందర్ జిల్లా ఇతర అధికారులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నేతలు నూకల శ్రీ రంగా రెడ్డి, శ్రీధర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డిలు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios