రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీ సంస్థకు రూ. మూడువేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ లో ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 150 కోట్లు కేటాయించారని మంత్రి పువ్వాడ తెలిపారు. 

ఈ నెల 27న ఖమ్మం కొత్త బస్టాండ్ ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐటీహబ్ రెండో దశకు శంఖుస్థాపన, సత్తుపల్లిలో మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని అజయ్ తెలిపారు. 

ఇల్లందు సర్కిల్ దగ్గరున్న ప్రస్తుత ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించారు. ఐటీ హబ్ మొదటి దశను 5 అంతస్థులను రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఐటీ హబ్ ను 41,250 చదరపు అడుగుల్లో 430 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేలా నిర్మించారు. 

రెండో దశ ఐటీ హబ్ ను అదే ప్రాంగణంలో 55వేల చదరపు అడుగుల్లో 570మంది ఉద్యోగులు ఒకేసారి విధులు నిర్వర్తించేలా నిర్మంచనున్నారు. రూ. 36 కోట్లతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరపనున్నారు.