తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం అర్థరాత్రి నుంచే సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. కాగా... సమ్మె గురించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా స్పందించారు. మూడు రోజులపాటు త్రిసభ్య కమిటీ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపారని ఆయన తెలిపారు.  కమిటీ చర్చల ఫలితాలను తాము ముఖ్యమంత్రి కేసీఆర్ కి వివరించినట్లు ఆయన తెలిపారు.

కార్మికులు చట్టబద్ధం కాని సమ్మెలోకి వెళ్తున్నారని ఆయన అన్నారు. సమ్మె పై నిషేధం, ఎస్మా అమల్లో ఉన్న సమయంలో మరియు కార్మిక శాఖ ఆద్వర్యంలో చర్చలు జరుపుతున్నామని... ఈనేపథ్యంలో సమ్మె  చేపట్టడం సరికాదని అన్నారు. రేపు సాయంత్రం ఆరు గంటల లోపు రిపోర్ట్ చేయరో వారు విధుల నుంచి తొలగిస్తామని చెప్పారు.

కమిటి సమయం కోరింది కాని యూనియన్ నాయకులు కార్మికుల జీవితాలని ఆయోమయంలోకి గురి చేస్తున్నారన్నారు. త్రి సభ్య కమిటి పని‌ పూర్తి అయిందన్నారు. ప్రభుత్వం త్రి సభ్య కమిటిని ఉపసంహరించుకుందన్నారు. ఇక మీదట యూనియన్ నాయకులతో చర్చలు ఉండవని తేల్చిచెప్పారు. పండగ సమయంలో సమ్మెకు వెల్లడం బాద్యాతారాహిత్యమని అన్నారు. విదుల్లో చేరే వారికి రక్షణ కల్పించాలని డీజీపిని‌ కోరామన్నారు. 

శుక్రవారం సాయంత్రం త్రిసభ్య కమిటీతో మరోసారి జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో సకల జనుల సమ్మెను మించిన సమ్మె ప్రస్తుతం అవసరమని.. అద్దె బస్సు  డ్రైవర్లు దీనికి సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి.

ఆర్టీసీలోని 50 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని.. ఎవరైనా డ్రైవర్లు బస్సులు నడిపితే వేలాది మంది కార్మికులకు ద్రోహం చేసినట్లేనని అశ్వత్థామరెడ్డి తెలిపారు.మరోవైపు సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్‌, మెట్రో సంస్థలను కోరారు... సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్‌ చేయొద్దని మెట్రో అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో స్పందించిన మెట్రో అధికారులు మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచారు. తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు నడుస్తుందని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రకటించింది.ఆర్టీసీలో అందుబాటులో ఉన్న 2100 అద్దెబస్సులు నడపాలని భావిస్తున్నట్లు త్రిసభ్య కమిటీ సభ్యుడు సునీల్‌ శర్మ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను భర్తీ చేసి నడుపుతాం.

3 వేల మంది డ్రైవర్లను తీసుకుంటాం. స్కూల్‌ బస్సులు 20వేలు ఉన్నాయి. ప్రైవేటు, స్కూల్‌, అద్దె బస్సులను నడుపుతాం. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.డ్రైవర్లకు రూ. 1,500, కండక్టర్లకు 1,000, రిడైర్డ్ సూపర్ వైజర్లకు 1,500, రిడైర్డ్ మెకానిక్‌లకు 1,000, రిడైర్డ్ క్లర్క్‌లకు 1,000 చొప్పున రోజూ వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీడియో

ఆర్టిసి సమ్మెపై మంత్రి సీరియస్... తీవ్ర హెచ్చరిక (వీడియో)...