Asianet News TeluguAsianet News Telugu

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సంతాపం..

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మృతిచెందారు.

Minister Prashanth Reddy Mother Passed Away ksm
Author
First Published Oct 12, 2023, 3:27 PM IST

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. ఇక,  ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మకు  గతంలో బ్రేయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మ హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో ప్రశాంత్ రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మంజులమ్మ అంత్యక్రియలు వారి స్వగ్రామం వేల్పూరులో రేపు ఉదయం జరపనున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేములకు, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంజులమ్మ మరణం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు స్పీకర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios