కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రులు, పలువురు నేతలకు రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రులు, పలువురు నేతలకు రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాసింది చదవడమే రాహుల్ చేస్తున్న పని అని విమర్శించారు. పెన్షన్ల గురించి రాహుల్‌కు ఏం తెలుసునని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ. 4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో వృద్ధాప్య పెన్షన్‌ రూ. 500, రాజస్థాన్‌లో రూ. 750 ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో వికలాంగులకు రూ.4వేలు ఇస్తున్నామని చెప్పారు. ముందుగా కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో రూ.4 వేలు పింఛన్‌ ఇవ్వాలన్నారు. 

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అవినీతికి అడ్రస్‌గా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే రూ.80 వేల కోట్లతో అని.. ఇందులో లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దేశంలో మార్పు కోసం కృషిచేస్తుందని చెప్పారు. తామెవరికీ ఏ టీమ్‌, బీ టీమ్‌ కాదని స్పష్టం చేశారు. 

Also Read: బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ.. కేసీఆర్ అవినీతి మోడీకి తెలుసు, అయినా : రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ఇక, ఆదివారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతికి మోదీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్టే.. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా వృద్ధులకి, వితంతువులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.