Asianet News TeluguAsianet News Telugu

యాసంగిలో వరిని కొనేది లేదు.. మరోసారి కుండబద్ధలు కొట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి

యాసంగిలో వరి కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి (telangana agriculture minister) నిరంజన్‌రెడ్డి (niranjan reddy) సంచలన ప్రకటన చేశారు. యాసంగిలో వరిని (paddy) ప్రభుత్వం కొనుగోలు చేయదని, వానాకాలం వరిపంటను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు

minister niranjan reddy sensational comments on rabi paddy crop
Author
Hyderabad, First Published Nov 6, 2021, 5:54 PM IST

యాసంగిలో వరి కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి (telangana agriculture minister) నిరంజన్‌రెడ్డి (niranjan reddy) సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో వరిని (paddy) ప్రభుత్వం కొనుగోలు చేయదని, వానాకాలం వరిపంటను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. యాసంగిలో తేమ కారణంగా బియ్యం కొనబోమని కేంద్రం చెప్పిందని మంత్రి గుర్తుచేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని.. కానీ, కొనడం లేదన్నారు. 

భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్ర స్పష్టంగా చెప్పిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ యాసంగిలో రైతులు వరి వేయకుండా ఇతర పంటలు వేసుకోవాలని సూచించారు. సీడ్‌ కంపెనీలతో ఒప్పందమున్న రైతులు, మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు వరి వేసుకోవచ్చని మంత్రి సూచించారు. వానాకాలంలో పండే వరి కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సాగు రంగాన్ని సీఎం కేసీఆర్‌ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. 

ALso Read:సొంత జిల్లాలోనే మంత్రి గంగులకు చేదు అనుభవం... (వీడియో)

బీజేపీ (bjp) వాళ్లకు దమ్ముంటే కేంద్రం కొంటుందని లేఖ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. కామారెడ్డి (kamareddy district) జిల్లాలో రైతు మృతిపై (farmer death) విచారణకు ఆదేశించామని మంత్రి స్పష్టం చేశారు. వేసవిలో వరి వేయొద్దని.. విత్తనం కోసం మాత్రమే వేయాలని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1.41 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, 62 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారని మంత్రి తెలిపారు. వానాకాలం పంట కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. రైతులకు వానాకాలం పంట కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు కలిగించమని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గతంలో పత్తిని (cotton) సాగు చేయాలని ప్రభుత్వం చెప్పిందని.. అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది పత్తికి రికార్డ్ స్థాయిలో ధర వస్తుందని తెలిపారు. కొన్ని రాజకీయపార్టీలు రైతులను ముందు పెట్టుకుని పబ్బం గడిపే ఆలోచనలో ఉన్నాయని ఆయన మండిపడ్డారు. 

కాగా.. కామారెడ్డి (kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ (lingam pet) వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల అకాల మృత్యువాతపడ్డాడు. గుండెపోటుతో ధాన్యం కుప్పపై కుప్పకూలాడు ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు వీరయ్య. కొనుగోలు ఆలస్యం కారణంగా ధాన్యం కుప్ప వద్ద నిద్రిస్తూ మరణించాడు. వారం రోజుల కిందట వడ్లను కొనుగోలు సెంటర్‌కు తీసుకొచ్చాడు రైతు. రోజూ వడ్ల కుప్ప దగ్గర కాపలా ఉంటున్నాడు. నిన్న రాత్రి ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ సెంటర్ కు వచ్చి వడ్ల కుప్ప దగ్గరే నిద్రపోయాడు. ఉదయం రైతు వీరయ్య ఇంటికి రాకపోవటంతో ఆయన భార్య.. కొనుగోలు సెంటర్‌కు వచ్చి చూసింది. అప్పటికీ వీరయ్య నిద్ర లేవలేదు. ఎంత లేపినా ఆయన మేల్కోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios