Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కు ‘మల్లన్న’ సినిమానే.. మంత్రి మల్లారెడ్డి హెచ్చరిక..

మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి కాంగ్రెస్ కు మల్లన్న సినిమా ఏంటో చూపిస్తానన్నారు. 70 రోజులు కష్టపడితే కాంగ్రెస్ ఖతమవుతందన్నారు. 

Minister Mallareddy warns congress, hyderabad - bsb
Author
First Published Sep 28, 2023, 9:33 AM IST

మల్కాజ్ గిరి : రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ మీద మరోసారి విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో చుక్కలు చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంత గొప్పవారైనా, ఎంత ధనవంతులైన పార్టీ వారిని డిస్మిస్ చేస్తుందని అన్నారు. మల్కాజిగిరిలో జరిగింది కూడా అదే అన్నారు. అందుకే మల్కాజిగిరి నుంచి వారికి పార్టీ బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. 

మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ బాధ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిల నేతృత్వంలో బుధవారం నాడు..  టిఆర్ఎస్ కార్యకర్తలు.. ఆనంద్ భాగ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరి నుంచి మల్కాజిగిరి కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత మల్కాజిగిరి చౌరస్తాలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి రాముడు లాంటి వాడని.. అతడిని ఆదరించాలని.. భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. 

హైద్రాబాద్‌ ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభం: ట్యాంక్ బండ్ వైపు కదులుతున్న గణపయ్య

ప్రతి ఒక్కరూ బిఆర్ఎస్ కి ఓటు వేయాలన్నారు. 70 రోజులు కష్టపడితే చాలు కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి మల్లన్న సినిమా చూపిస్తా అంటూ సవాల్ చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మల్కాజిగిరికి మిషన్ భగీరథ కింద మంచినీటి సరఫరా తెచ్చారని ఆ ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ‘బీఆర్ఎస్ అంటే స్కీం అని.. కాంగ్రెస్ అంటే స్కామ్’ అని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.

ఇక ఈ మీటింగ్ లో మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాలలోకి వచ్చానన్నారు. ఇప్పటికే అరుంధతి ఆస్పత్రి ద్వారా అనేక మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ లో ఇంకో మంచినీటి రిజర్వాయర్, రైల్వే గేట్ల దగ్గర ఆర్యూబీలు నిర్మించాల్సిన అవసరం ఉందని.. వీటిని ప్రణాళిక ప్రకారం నిర్మించుకుంటూ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు గౌతంనగర్ నేరేడ్మెట్ ఆల్వాల్ కార్పొరేటర్ అయిన సునీత, మీనా, శాంతి... మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కూడా పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios