Asianet News TeluguAsianet News Telugu

భద్రకాళీ ఆశీస్సులతో బయల్దేరతారు .. ఢిల్లీలో వచ్చేది కేసీఆర్ నిలబెట్టిన ప్రభుత్వమే: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తప్పిడం తథ్యమని ఆయన సవాల్ విసిరారు.

minister malla reddy sensational comments on kcr national politics
Author
Warangal, First Published May 27, 2022, 2:28 PM IST

మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కేసీఆర్ ప్రభుత్వమే రాబోతోందన్నారు. వరంగల్ పర్యటనలో వున్న మంత్రి మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని జోస్యం చెప్పారు. దసరా నాడు  వరంగల్ భద్రకాళీ ఆశీర్వాదంతో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి బయల్దేరతారని అన్నారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ఇప్పటికే దివాళా తీసిందని.. ఇప్పుడు బీజేపీ దివాళా తీయబోతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. రేవంత్ ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని ఆయనది బ్లాక్ మెయిల్ చరిత్ర అని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. తామిద్దరం టీడీపీలో ఉన్న సమయంలో తనను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశాడని మల్లారెడ్డి ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతామని మంత్రి చెప్పారు. అయితే కొంత సమయం వేచి చూడాలని ఆయన మీడియా ప్రతినిధులను కోరారు. దొంగే ఎదుటి వాడిని దొంగ దొంగ అంటాడన్నారు.

Also Read:బ్లాక్ మెయిలర్, జైలుకు పంపుతాం: రేవంత్ పై మంత్రి మల్లారెడ్డి ఫైర్

ఉద్దేశ్యపూర్వకంగానే తమ కుటుంబంపై TPCC  చీఫ్ రేవంత్ రెడ్డి బురద చల్లుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ రెడ్డి అంటూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతు బండ కాదు లుచ్చాబండ అంటూ మంత్రి పరుష పదజాలం ఉపయోగించారు. కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందన్నారు. నైట్ క్లబ్ లలో తిరుగుతున్న రాహుల్ గాంధీని తీసుకొచ్చి డిక్లరేషన్ అంటూ ప్రకటింపజేశారని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. Rahul Gandhi, రేవంత్ రెడ్డిలు తోపులా అని మంత్రి ప్రశ్నించారు. 

Nara Lokesh చాలా మంచోడు..  ఏం చెప్పినా నమ్మేవాడన్నారు.Chandrababu Naidu సమర్ధుడైన నాయకుడని మల్లారెడ్డి చెప్పారు. లోకేష్ ను రేవంత్ రెడ్డి పట్టుకున్నాడన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాటలు నమ్మి చంద్రబాబు ఆయనకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడని మల్లారెడ్డి చెప్పారు. Telangana టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ఎవరికీ కూడా గౌరవం ఇవ్వలేదన్నారు.మల్కాజిగిరి  సీటు విషయమై తనకు రేవంత్ రెడ్డికి మధ్య గొడవ ప్రారంభమైందన్నారు. టీడీపీలో ఉన్న సమయంలో మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం తనతో రేవంత్ రెడ్డి గొడవ పెట్టుకున్నారన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios