Asianet News TeluguAsianet News Telugu

బ్లాక్ మెయిలర్, జైలుకు పంపుతాం: రేవంత్ పై మంత్రి మల్లారెడ్డి ఫైర్


రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్ అంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి జైలుకు పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన చెప్పారు.
 

Telangana Minister Malla Reddy Serious Comments On TPCC Cief Revanth Reddy
Author
Hyderabad, First Published May 24, 2022, 1:13 PM IST

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డిది బ్లాక్ మెయిల్ చరిత్ర అని ఆయన చెప్పారు. తామిద్దరం టీడీపీలో ఉన్న సమయంలో తనను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశాడని మల్లారెడ్డి చెప్పారు. అక్రమాలకు పాల్పడిన రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. అయితే కొంత సమయం వేచి చూడాలని ఆయన మీడియా ప్రతినిధులను కోరారు. దొంగే ఎదుటి వాడిని దొంగ దొంగ అంటాడన్నారు.

మంగళవారం నాడు తెలంగాణ మంత్రి Malla Reddy  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ Revanth Reddy  తనపై తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమ కుటుంబంపై TPCC  చీఫ్ రేవంత్ రెడ్డి బురద చల్లుతున్నారన్నారు.రేవంత్ రెడ్డి ఓ దొంగ రెడ్డి అంటూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతు బండ కాదు లుచ్చాబండ అంటూ మంత్రి పరుష పదజాలం ఉపయోగించారు. కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందన్నారు. నైట్ క్లబ్ లలో తిరుగుతున్న రాహుల్ గాంధీని తీసుకొచ్చి డిక్లరేషన్ అంటూ ప్రకటింపజేశారని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. Rahul Gandhi, రేవంత్ రెడ్డిలు తోపులా అని మంత్రి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అవుతుందని మల్లారెడ్డి చెప్పారు. తాను, రేవంత్ రెడ్డిలు గతంలో TDP లో ఉండేవాళ్లమని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు.

Nara Lokesh చాలా మంచోడు..  ఏం చెప్పినా నమ్మేవాడన్నారు.Chandrababu Naidu సమర్ధుడైన నాయకుడని మల్లారెడ్డి చెప్పారు. లోకేష్ ను రేవంత్ రెడ్డి పట్టుకున్నాడన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాటలు నమ్మి చంద్రబాబు ఆయనకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడని మల్లారెడ్డి చెప్పారు. Telangana టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ఎవరికీ కూడా గౌరవం ఇవ్వలేదన్నారు.మల్కాజిగిరి  సీటు విషయమై తనకు రేవంత్ రెడ్డికి మధ్య గొడవ ప్రారంభమైందన్నారు. టీడీపీలో ఉన్న సమయంలో మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం తనతో రేవంత్ రెడ్డి గొడవ పెట్టుకున్నారన్నారు. ఈ విషయమై తన కాలేజీలు మూసివేయిస్తామని కూడా బ్లాక్ మెయిల్ చేశారని  మల్లారెడ్డి చెప్పారు. తనకు సీటు రాకుండా ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి చేసిన కుట్రను ఢిల్లీలో ఉన్న చంద్రబాబుకు చూపడంతో Malkajgiri ఎంపీ సీటును తనకే ఇచ్చారన్నారు. ఈ సీటులో తాను విజయం సాధించడంతో తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాడని కూడా మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.ఈ విషయమై తాను చంద్రబాబు కూడా దృష్టికి  తీసుకెళ్లినట్టుగా చెప్పారు. తాను ఇచ్చిన డబ్బులతోనే రేవంత్ రెడ్డి తన కూతురు వివాహం చేశాడన్నారు.ఈ విషయమై యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నావా అని రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.రేవంత్ రెడ్డి రక్తం తాగే మనిషి అని రేవంత్ రెడ్డి చెప్పారు.పీసీసీ అధ్యక్ష పదవిని కూడా రేవంత్ రెడ్డి కొనుగోలు చేశాడన్నారు. 

చివరకు రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయగలరా అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి అటెండర్ కూడా కాలేడు, ఇక సీఎం ఎలా అవుతాడని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.

తాను ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమిని కొనుగోలు చేయలేదన్నారు. తాను డబ్బులు పెట్టి భూమిని కొనుగోలు చేసినట్టుగా చెప్పారు.కాంగ్రెస్, బీజేపీ నేతలు భూములు కొనడం లేదా అని ఆయన ప్రశ్నించారు.మార్కెట్ రేటు కంటే ఎక్కువ రేటుకే కొనుగోలు చేసినట్టుగా ఆయన చెప్పారు.

రెడ్డి సామాజిక వర్గంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్వంత సామాజిక వర్గంలోనే అసంతృప్తిని రేకేత్తించాయన్నారరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వచ్చినా ప్రజలు తరిమి కొట్టాలని ఆయన కోరారు.

మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే?

మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్  రైతు రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం నాడు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లి ధరణి పోర్టల్ ను ప్రారంభించారన్న రేవంత్ రెడ్డి, ఈ గ్రామంలోనే ధరణిలో అనేక సమస్యలున్నాయన్నారు. ఈ గ్రామంలో 582 మందికి ఖాతా నెంబర్లు లేవని, రెవెన్యూ నక్ష లేదన్నారు. దీంతో గ్రామంలో రైతు బంధు పథకం అమలు చేయడంలేదన్నారు. రైతు బీమా రావడం లేదన్నారు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులకు చాలా నష్టాలు జరుగుతున్నాయన్నారు. గ్రామంలో పూర్తిగా సర్వే చేయించి టీ పన్ ప్రకారం సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. 

మంత్రి మల్లారెడ్డి, ఆయన బావమరిది భూకబ్జాలు, అక్రమాలు, అవినీతిపైన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే  మల్లారెడ్డి అక్రమాలపై విచారణ చేయిస్తామని ప్రకటించారు.అంతేకాదు జైలుకు కూడా పంపుతామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios