తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి మరీ తన వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సోమవారం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ గుద్దేసింది. ఈ ఘటనలో వ్యక్తి కాలు లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి మల్లా రెడ్డి వెంటనే స్పందించారు. గాయపడిన వ్యక్తిని వెంటనే తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు.