మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి: ఘట్‌కేసర్ పోలీసులకు టీఆర్ఎస్ ఫిర్యాదు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు  ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. నిందితులపై  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Malla Reddy convoy attacked: TRS Complains Against Congress To Ghatkesar Police Station


హైదరాబాద్: తెలంగాణ మంత్రి Malla Reddy పై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ TRS నేతలు సోమవారం నాడు Ghatkesar Police Station లో ఫిర్యాదు చేశారు. 

ఈ నెల 29న ఘట్ కేసర్ లో జరిగిన రెడ్ల సింహాగర్జన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆ తర్వాత ఆయన సభ నుండి వెళ్లిపోతున్న  సమయంలో కొందరు మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  

మంత్రి మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మంత్రి మల్లారెడ్డి ఈ దాడి నుండి తప్పించుకున్నారు. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై చెప్పులు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి కూడా సీరియస్ గా స్పందించారు. తనను హత్య చేసేందుకు టీపీసీసీ చీఫ్ Revanth Reddy కుట్ర చేశారని ఆరోపించారు. ఘట్‌కసర్ లో తనపై దాడికి ప్రయత్నించింది రేవంత్ రెడ్డి అనుచరులేనని ఆయన ఆరోపించారు.

మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు ఇవాళ ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతలు మంత్రి మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

also read:నాపై జరిగిన దాడి వెనుక రేవంత్ రెడ్డి కుట్ర.. భయపడే ప్రసక్తే లేదు: మంత్రి మల్లారెడ్డి

 ఘట్‌కేసర్‌లో నిన్న నిర్వహించిన రెడ్డి సింహగర్జన సభలో మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ సభకు హాజరైన వారు నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్‌పై బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో మంత్రి మల్లారెడ్డి  వివరిస్తుండగా మల్లారెడ్డిని కొందరు అడ్డుకున్నారు. రెడ్లకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. వాగ్వాదం శృతిమించడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్ధితి నెలకొంది. చివరికి సింహగర్జన సభ నుంచి మంత్రి మల్లారెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు.  మంత్రి వెళ్లిపోతున్న సమయంలో ఆయన కాన్వాయ్ పై కుర్చీలు, చెప్పులు విసిరారు.  మంత్రి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు.

ఈ నెల 24వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను టీడీపీలో ఉన్న సమయం నండి రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కూడా ఆయన ఆరోపించారు. మల్కాజిగిరి ఎంపీ సీటు రాకుండా రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలను వివరించారు. ఈ పరిణామాలను తాను చంద్రబాబుకు వివరించడంతో తనకే చంద్రబాబు టికెట్ ఇచ్చారన్నారు.

తాను మల్కాజిగిరి ఎంపీ అయిన తర్వాత కూడా తనను బ్లాక్ మెయిల్ చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వ నాశనం అవుతుందన్నారు. చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తారని ఆయన విమర్శించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios