సారాంశం

తెలంగాణ మంత్రి మహమూద్ అలీ  ఇవాళ సహనం కోల్పోయారు. సెక్యూరిటీ గార్డు చెంపపై కొట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ  శుక్రవారంనాడు కానిస్టేబుల్ పై చెంపపై కొట్టారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై  హోంమంత్రి మహమూద్ అలీ  చేయిచేసుకున్నారు.  తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  పుట్టిన రోజు.దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ  తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు వెళ్లారు. తలసాని శ్రీనివాస్ ను మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకున్నారు.అదే సమయంలో బోకే గురించి తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు.

అయితే  బోకే గురించి తెలియదని  సెక్యూరిటీ గార్డు చెప్పడంతో సహనం కోల్పోయిన  హోంమంత్రి మహమూద్ అలీ  సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నారు.ఈ సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  మంత్రి మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి మహమూద్ అలీ చెంపపై  కొట్టడంతో  సెక్యూరిటీ గార్డ్ షాక్ కు గురయ్యారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలను కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించారు.