Asianet News TeluguAsianet News Telugu

ప్రగతి నివేదన సభకు వస్తూ గాయపడిన కార్యకర్త: మంత్రి పరామర్శ

టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ తాము అన్ని విధాల అండగా ఉంటూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం ప్రగతి నివేదన సభకు బైకు ర్యాలీలో వస్తూ బైక్ పై నుంచి పడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామరాజు గౌడ్ ను మంత్రి పరామర్శించారు. 

minister lakshmareddy visited nims hospital
Author
Hyderabad, First Published Sep 3, 2018, 1:24 PM IST


హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ తాము అన్ని విధాల అండగా ఉంటూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం ప్రగతి నివేదన సభకు బైకు ర్యాలీలో వస్తూ బైక్ పై నుంచి పడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామరాజు గౌడ్ ను మంత్రి పరామర్శించారు. 

రాజపూర్ మండలం రాయపల్లికి చెందిన రామరాజుగౌడ్ టీఆర్ఎస్ పార్టీ వీరాభిమాని. ప్రగతి నివేదన సభకు బైక్ ర్యాలీలో వస్తూ బైక్ పై నుంచి పడి గాయపడ్డాడు. మంత్రి సి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు రామరాజు గౌడ్ ను నిమ్స్ లో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న రామరాజుని మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డాక్టర్లకు ఆదేశించారు.

టీఆర్ఎస్ కార్యకర్త రామరాజు గౌడ్ కు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామన్నమంత్రి  కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రామరాజుని అన్ని విధాలా ఆదుకుంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. బైకు ర్యాలీలో సభకు వస్తుండగా రామరాజు బైక్ పై నుంచి కిందపడటం దురదృష్టకరమని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రామరాజు ని వెంటనే నిమ్స్ లో చేర్పించటం, అవసరమైన వైద్యం అందించడం జరిగిందన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios