తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. నియోకవర్గంలోని వాడవాడలా తిరుగుతూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద చాయ్ తాగుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు మంత్రి లక్ష్మారెడ్డి.
మహబూబ్ నగర్ : తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. నియోకవర్గంలోని వాడవాడలా తిరుగుతూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద చాయ్ తాగుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు మంత్రి లక్ష్మారెడ్డి.
మరోవైపు నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డికి పోలేపల్లి వాసి శంకరయ్య గౌడ్
వినూత్న రీతిలో తన అభిమానం చాటుకున్నాడు. లక్ష్మారెడ్డికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటేస్తానంటూ హామీ ఇచ్చాడు. ప్రతీ ఒక్కరూ అభివృద్ధికి పాటుపడుతున్న లక్ష్మారెడ్డికి ఓటెయ్యాలంటూ విజ్ఞప్తి చేశాడు.
శంకరయ్యగౌడ్ అభిమానంతో మంత్రి లక్ష్మారెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. మంత్రి లక్ష్మారెడ్డి శంకరయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్ఫూర్తిని ప్రజలంతా కొనసాగించాలని శంకరయ్య మంత్రి పిలుపునిచ్చారు.
ప్రజల ఆశీస్సులున్నంత కాలం ప్రజా సేవలోనే ఉంటానన్నారు. తనకు ప్రజలు పడుతున్న బ్రహ్మరథానికి జీవితాంతం రుణ పడి ఉంటానని, ప్రజలకు సేవలు చేసి వారి రుణం తీర్చుకుంటానని మంత్రి లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
"
