Asianet News TeluguAsianet News Telugu

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్..

తెలంగాణ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ జల దృశ్యంలో ఆయన విగ్రహాన్ని తెలంగా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 

Minister KTR Unveiled Konda laxman bapuji statue at jala drushyam
Author
First Published Sep 27, 2022, 12:11 PM IST

తెలంగాణ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ జల దృశ్యంలో ఆయన విగ్రహాన్ని తెలంగా ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మేల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ .రమణ, బాపూజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేటీఆర్.. జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశామని పేర్కొన్నారు. 

‘‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో; ఈరోజు అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 ఇదిలా ఉంటే.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం రాష్ట్ర స్థాయి నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా ఘటన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం పోరాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమకారుడు, ప్రజాస్వామికవాది, అణగారిన వర్గాలకు బలమైన మద్దతుదారుడు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భావి తరాలకు ఆదర్శనీయమన్నారు.

 

 

కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని.. అలాగే చాకలి ఐలమ్మ సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారని సీఎం గుర్తు చేశారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్న ముఖ్యమంత్రి.. ఉద్యానవన విశ్వ విద్యాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తు చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios