Asianet News TeluguAsianet News Telugu

ఏడున్నర గంటలుగా సాగుతోన్న కవిత విచారణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. దాదాపు 7.30 గంటలుగా ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో చెల్లిని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 
 

minister ktr tweet on brs mlc kalvakuntla kavitha ed inquiry in delhi liquor scam
Author
First Published Mar 21, 2023, 6:53 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటలకు ఆమె ఈడీ ఎదుట హాజరుకాగా.. దాదాపు 7 .30 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారు. వరుసగా రెండో రోజు కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నాయి. దీంతో ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలు భారీగా మోహరించారు. మరోవైపు.. తన సోదరి కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ ఈ రోజు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు’ అంటూ  TO KILL A DEMOCRACY అనే పుస్తకం కవర్ పేజీని ఆయన పోస్ట్ చేశారు. 

అంతకుముందు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరిన సమయంలో.. కవిత తన కారులో నుంచి బయటకు వచ్చి కవర్‌లలో ప్యాక్ చేసి ఉన్న తన ఫోన్‌లను మీడియా ఎదుట ప్రదర్శించారు. అనంతరం ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు. ఈడీ కార్యాలయం వద్ద కూడా కవిత మరోసారి తన ఫోన్లను మీడియా  ముందు ప్రదర్శించారు. 

ALso Read: రాజకీయ కోణంలోనే విచారణ, నా ఫోన్లు ఇస్తున్నా: ఈడీకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే రెండు సార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు.. నేడు  మరోసారి విచారిస్తున్నారు. తొలుత ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. సోమవారం దాదాపు 10 గంటలకు పైగా ఆమెను విచారించారు. నిన్న రాత్రి 9 గంటల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. వరుసగా రెండో రోజు కవితను ఈడీ అధికారులు విచారించనుండటంతో.. ఈరోజు ఎలాంటి పరిణామాలు  చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

అయితే ఈరోజు విచారణలో కవిత ఫోన్ డేటాపై ఈడీ అధికారులు దృష్టిసారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కవిత తన వద్ద ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఎలాంటి ఫోన్లను ధ్వంసం చేయలేదని కవిత చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈడీ ముందు సమర్పించనున్న మొబైల్ ఫోన్లను కవిత మీడియా ముందు ప్రదర్శించారు. 

ALso REad: ఢిల్లీ లిక్కర్ స్కామ్: మూడో రోజు ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత.. ఉత్కంఠగా పరిణామాలు..!

మరోవైపు.. ఈడీకి  మంగళవారంనాడు  కవిత   లేఖ  రాశారు. తనను  రాజకీయ కోణంలోనే  విచారణ  చేస్తున్నారని  ఈడీకి  రాసిన  లేఖలో  కవిత పేర్కొన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందని  ఆ లేఖలో  కవిత  ఆరోపించారు.   గతంలో  తాను  ఉపయోగించిన  అన్ని  ఫోన్లను  ఈడీకి అందిస్తున్నానని  కవిత  ఆ లేఖలో  పేర్కొన్నారు. తాను  ఫోన్లను ధ్వంసం చేశానని  తప్పుడు ప్రచారం చేశారని  కవిత ఆ లేఖలో  పేర్కొన్నారు. ఏ ఉద్దేశ్యంతో  ఇలా  చేశారని ఆమె  ప్రశ్నించారు. మహిళ  ఫోన్లను  స్వాధీనం  చేసుకోవడం స్వేచ్ఛకు భంగం కల్గించడమేనని  కవిత  పేర్కొన్నారు. ఫోన్ల విషయంలో  కనీసం  సమన్లు  కూడా  ఇవ్వలేదని  కవిత  గుర్తు  చేశారు.  2022 నంబర్ మాసంలోనే  తాను  ఫోన్లను  ధ్వంసం చేసినట్టుగా  తప్పుడు  ప్రచారం చేశారని  కవిత ఆ లేఖలో  పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం  విచారణకు  సహకరిస్తున్నట్టుగా  కవిత  ఆ లేఖలో   ప్రస్తావించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios