ముషీరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటిఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి జరిగింది.  ముషీరాబాద్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం రసాభాసగా మారింది.

"

కేటీఆర్ ప్రోటోకాల్ పాటించలేదని బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డౌన్ డౌన్ కేటీఆర్, డౌన్ డౌన్ టీఆర్ఎస్ అంటూ గళమెత్తారు. 

వీరికి కౌంటర్ గా బిజెపికి,  మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.  బీజేపీ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ కి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని ఆపి పక్కకు తీసుకెళ్లారు.