Asianet News TeluguAsianet News Telugu

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ప్రచారం చేస్తాం.. తెలంగాణపై కేంద్రానికి కక్ష ఎందుకు?: కేటీఆర్

దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ ఒక రోల్‌ మోడల్ అని చెప్పారు.

Minister KTR speech on telangana Assembly
Author
First Published Feb 4, 2023, 2:04 PM IST

దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ ఒక రోల్‌ మోడల్ అని చెప్పారు. తెలంగాణ సమ్మిళిత, సమీకృత, సమగ్రాభివృద్దిని సాధించిందని అన్నారు. ఈరోజు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ దేశం కడుపు నింపే స్థాయికి చేరుకుందని అన్నారు. తెలంగాణలో కరెంట్ కష్టం లేదు.. తాగునీటి తిప్పలు లేవని చెప్పారు. 

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది దేశంలో ఎందుకు జరగదని అడుగుతామని చెప్పారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత, మెచ్చని పారిశ్రామికవేత్త లేరని అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందన్నారు. తాము రైతు రాజ్యం కావాలంటే.. కేంద్రం కార్పొరేట్ రాజ్యం కావాలని అంటుందని అన్నారు. యూఎన్‌వో కూడా రైతుబంధును ప్రశంసించిందని చెప్పారు.

రోజుకు మూడు డ్రెస్స్‌లు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పనిచేయాలని అన్నారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతులు ప్రాణాలు తీసింది ఎవరని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరని అన్నారు. 

కాంగ్రెస్ హయంలో విద్యుత్ కోతలు ఉండేవని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని అన్నారు. కరెంట్ గురించి బీజేపీ నేతలు మాట్లాడుతారని.. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలీడేలు ప్రకటిస్తున్నారని అన్నారు. గుజరాత్‌లో కరెంట్ కోతలు ఉన్నాయని.. నీటి కొరత ఉందని విమర్శించారు. బీజేపీవాళ్ల తమకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల రాజేందర్.. అటువెళ్లాక పూర్తిగా మారిపోయారని విమర్శించారు. 

ఏడు మండలాలను అనాగరికంగా ఏపీలో కలిపారని విమర్శించారు. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని అన్నారు. కేంద్రం యాదాద్రి పవర్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం  చేస్తోందని విమర్శించారు. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వొద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి కక్ష ఎందుకని ప్రశ్నించారు. దక్షణతోనే తాము పని చేస్తుంటే.. కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఏం అవసరమో కేసీఆర్‌‌కు తెలుసని అన్నారు. సద్విమర్శలు చేయండి కానీ.. రాష్ట్రాన్ని కించపరచవద్దని కోరారు. దేశప్రజల చూపు కేసీఆర్ వైపు చూస్తున్నారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios