తెలంగాణలో ప్రతి ఇంచి భూమిని డిజిటల్ సర్వే చేయబోతున్నామన్నారు మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2020 సదస్సులో ఆయన పాల్గొన్నారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో కొన్ని ఇబ్బందులు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. వాటిని కొద్దిరోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

అవసరమైతే పాత పద్ధతిలోనే మళ్లీ రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామని... సంస్కరణల ఫలాలు ప్రజలకు అందాలని ఆయన ఆకాంక్షించారు. పెద్ద పెద్ద సంస్కరణలు తెచ్చినప్పుడు కొన్ని సమస్యలు సహజమేనని.. డబ్బులు ఖర్చు పెట్టడమే అభివృద్ధి కాదన్నారు.

ధరణి వల్ల రిజస్ట్రేషన్లు  పారదర్శకంగా జరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలని.. ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు.

ఏ సంస్థ నివేదిక ఇచ్చినా హైదరాబాద్ పురోగతిని స్పష్టం చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఒకరు సమాధులు.. మరొకరు సర్జికల్ స్ట్రైక్ అంటారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.