Asianet News TeluguAsianet News Telugu

పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డిలే కేసులు వేసింది : వారి వివరాలు వెల్లడించిన కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లాను సీఎం కేసీఆర్ పచ్చని మాగాణంలా మార్చాలని భావిస్తుంటే అందుకు కాంగ్రెస్ నాయకులు అడుగడుగున్న అడ్డుపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపండంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. పర్యావరణానికి, అటవీ జంతువులకు ఈ ప్రాజెక్టు వల్ల హాని జరుగుతుందంటూ 2014 ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుండి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి, కోల్లాపూర్ నుండి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డిలు కేసులు వేశారని వివరించారు.  వీరిని ఇదే జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ బడా నాయకులు వెనుకుండి నడిపిస్తున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. 

minister ktr speech at nagarkurnool
Author
Nagarkurnool, First Published Sep 27, 2018, 8:35 PM IST

మహబూబ్ నగర్ జిల్లాను సీఎం కేసీఆర్ పచ్చని మాగాణంలా మార్చాలని భావిస్తుంటే అందుకు కాంగ్రెస్ నాయకులు అడుగడుగున్న అడ్డుపడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపండంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. పర్యావరణానికి, అటవీ జంతువులకు ఈ ప్రాజెక్టు వల్ల హాని జరుగుతుందంటూ 2014 ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుండి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి, కోల్లాపూర్ నుండి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డిలు కేసులు వేశారని వివరించారు.  వీరిని ఇదే జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ బడా నాయకులు వెనుకుండి నడిపిస్తున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. 

ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కేటీఆర్ వివరించారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ది కోసం కోటి రూపాయలు ఇచ్చేవారని గుర్తుచేశారు. కానీ ఆ నిధుల విషయంలో  తీవ్ర వివక్ష ఉండేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలయితే ఈ నిధులు మొత్తం ఖర్చు చేయొచ్చు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలయితే ఇంచార్జి మంత్రి అనుమతితో ఖర్చు చేయాల్సి ఉండేదన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి వివక్ష లేకుండా ఎమ్మెల్యేలందరిని సమానంగా  చూశామని... నియోజకవర్గ అభివృద్ది నిధులు 3 కోట్ల పెంచి వాటిని ఖర్చు చేసే అధికారం ఎమ్మెల్యేలకే ఇచ్చామని పేర్కొన్నారు.  

తమ పాలనలో పాలమూరు పచ్చబుడుతుంటే కాంగ్రెస్ నాయకులు కళ్లు ఎర్రబడుతున్నాయని విమర్శించారు.  ఒకటి కాదు... రెండు కాదు...మొత్తం రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులపై ఈ కాంగ్రెసోళ్లు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నాయకులే ఎక్కువ నాటకాలాడుతున్నారని అన్నారు. శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడుకు పొక్క బెట్టి, అనంతపురంలో హంద్రీనివాలో హారతి నీళ్లను తరలిస్తే ఈ నాయకులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మేము నీళ్లిస్తామంటే కేసులు వేస్తారా అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి కూడా అనేక కేసులు పెట్టారని కేటీఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని అలాంటిది ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు టీడీపీ తోకపార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇలా చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ కు రెండోసారి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్న ఇప్పుడు మరోసారి క్షోభిస్తుందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో కోదండరాం పొత్తుపెట్టుకోవడం...దానిని అమరుల ఆకాంక్షగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 119 సీట్లలో పోటీ చేస్తానని చెప్పి ధీరాలు పలికిన కోదండరాం ఇప్పుడు ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios