Asianet News TeluguAsianet News Telugu

ఫాక్స్‌కాన్‌ను తన్నుకుపోవాలని యత్నాలు , తెలంగాణలో కాంగ్రెస్ వస్తే.. కంపెనీలన్నీ కర్ణాటకకే : కేటీఆర్ వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్ సింహాం లాంటోడని .. సింగిల్‌గానే వస్తారంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు . కాంగ్రెస్‌లో సీఎం దొరికారు కానీ.. ఓటర్లు దొరకడం లేదని , జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరని, కానీ సీఎం పదవి మాత్రం కావాలంటూ చురకలంటించారు. 

minister ktr sensational comments on congress party ksp
Author
First Published Nov 4, 2023, 6:03 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ సింహాం లాంటోడని .. సింగిల్‌గానే వస్తారంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బక్క పలుచని కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు అందరూ ఏకమవుతున్నారని చురకలంటించారు. కేసీఆర్ 2014లో, 2018లో ఎవర్నీ నమ్ముకోలేదని.. ప్రజలను నమ్ముకున్నారని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజలనే నమ్ముకుంటున్నామని.. మాకు మా మీద, ప్రజల మీద విశ్వాసం వుందని మంత్రి తెలిపారు. 

కేసీఆర్ న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. మోడీ, అమిత్ షా, 16 మంది ముఖ్యమంత్రులు, రాహుల్ , సోనియా, ప్రియాంక ఇలా అందరూ కేసీఆర్ మీదకు వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ లాంటి నేత వుంటేనే తెలంగాణ సురక్షితంగా వుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులకు ధీటుగా న్యాయవాదులు పోరాడారని మంత్రి గుర్తుచేశారు. అడ్వోకేట్ ట్రస్ట్‌ను రూ. 500 కోట్లకు పెంచుతామని.. న్యాయవాదులకు వైద్య బీమాను కూడా పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని.. ఈ పోరాటం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతుందని కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్‌లో సీఎం దొరికారు కానీ.. ఓటర్లు దొరకడం లేదని , జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరని, కానీ సీఎం పదవి మాత్రం కావాలంటూ చురకలంటించారు. తెలంగాణకు 24 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని.. ఐటీ ఎగుమతులు 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్ సంస్థను కర్ణాటకకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కర్ణాటకకు పోతాయని కేటీఆర్ హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios