Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక నుంచి వందల కోట్లు.. తెలంగాణలో ‘స్కామ్‌గ్రెస్’కు చోటు లేదు : కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక నుంచి వందల కోట్లు వస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. 

minister ktr sensational comments on congress party ksp
Author
First Published Oct 13, 2023, 4:13 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తూ వుండగా.. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధుల ఎంపికలోనే వున్నాయి. మరోవైపు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరుగుతోంది. విపక్షాలకు తన దైన శైలిలో కౌంటరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక నుంచి వందల కోట్లు వస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

 

 

ఓటుకు నోటు కేసులో నాడు లంచం ఇస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని చురకలంటించారు. తెలంగాణలో స్కామ్ గ్రెస్‌కు చోటు లేదన్నారు. అలాగే కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ, కాంగ్రెస్ నేతలు దొరికిపోయారని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. 

అంతకుముందు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. డీజీపీని తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా వున్న వారిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిఘా పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని.. 45 రోజులు కష్టపడితే అధికారం మనదేనని ఆయన అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios