నిజాం కాలేజ్ విద్యార్థినులు చేస్తున్న ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని విద్యార్థినిల సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు.
నిజాం కాలేజ్ విద్యార్థినులు చేస్తున్న ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ కేటాయింపు సమస్యపై నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్‌లో యూజీ విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి ఆందోళనపై స్పందించిన కేటీఆర్.. ఈ విషయంలో జోక్యం చేసుకుని విద్యార్థినిల సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. ఈ మేరకు ఓ నెటిజన్ ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
విద్యార్థుల కోరిక మేరకు బాలికల హాస్టల్‌ను నిర్మించి కళాశాలకు అప్పగించడం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి అసంబద్ధంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు కేటీఆర్ సూచించారు.
ఇక, నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్‌లో విద్యార్థినీలకు వసతి కల్పించాలని కోరుతూ నిజాం కళాశాల విద్యార్థులు గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. సోమవారం కాలేజ్ ఎదుట విద్యార్థులు మౌనదీక్ష చేపట్టారు. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించారని.. అయితే నేటి వరకు హాస్టల్‌లో యూజీ విద్యార్థినులకు వసతి కల్పించేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాలేజ్ హాస్టళ్లలో వసతి అవసరమైన దాదాపు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో పెద్ద మొత్తం డబ్బులు చెల్లించి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు హాస్టల్‌లో వసతి కల్పించాలని కాలేజ్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఆందోళన చేస్తున్న విద్యార్థినులు చెబుతున్నారు. ఇటీవల హాస్టల్‌లో పీజీ విద్యార్థులకు వసతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నారనీ.. యూజీ విద్యార్థులను హాస్టల్‌లో ఎందుకు ఉంచడం లేదో తమకు తెలియదని అన్నారు.
నిజాం కాలేజ్ లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. యూజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించాలని కాలేజీలో శాంతియుత నిరసనలు తెలుపుతున్నారు. కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థులకు కాకుండా పీజీ స్టూడెంట్స్ కు ఇవ్వడంపై కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
