Asianet News TeluguAsianet News Telugu

భూమిని కేటాయిస్తాం.. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ పెట్టండి: కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ప్రపంచవ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యవసరమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

minister ktr requests central govt to establish vaccine testing centre in hyderabad ksp
Author
Hyderabad, First Published Jun 20, 2021, 3:55 PM IST

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ప్రపంచవ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యవసరమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే నెలకి 8 నుంచి 10 కోట్ల టీకా డోసులను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read:బంగారు తెలంగాణ వచ్చి తీరుతుంది: కేసీఆర్

టెస్టింగ్ సెంటర్ వల్ల ఆరు నెలల్లో హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం వుందని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ సరఫరా అవశ్యకతను దృష్టిలో వుంచుకొని వెంటనే ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటుకు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన భూమిని జినోమ్ వ్యాలీలో కేటాయిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 

ఇక్కడి సంస్థలు వ్యాక్సిన్ టెస్టింగ్ కోసం అక్కడి పంపాల్సిన పరిస్ధితి నెలకొందని కేటీఆర్ అన్నారు. దీని వల్ల 45 రోజుల సమయం వృథా అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సరఫరాలో ఆవశ్యకతను గుర్తించి హైదరాబాద్‌లో సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నేషనల్ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ వందల కిలోమీటర్ల దూరంలో వుందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios