Asianet News TeluguAsianet News Telugu

బంగారు తెలంగాణ వచ్చి తీరుతుంది: కేసీఆర్

తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రం కావడం తథ్యమని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. దీన్ని ఎవరూ కూడ ఆపలేరన్నారు.

We will achieve Bangaru Telangana: KCR lns
Author
Siddipet, First Published Jun 20, 2021, 3:50 PM IST

సిద్దిపేట:తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రం కావడం తథ్యమని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. దీన్ని ఎవరూ కూడ ఆపలేరన్నారు.తెలంగాణ సాధిస్తామని ఎవరైనా అనుకొన్నామా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు.  తాను తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించిన రోజు ఎవరూ కూడ నమ్మలేదన్నారు. కానీ తెలంగాణ సాధించామన్నారు. తాను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్దమేనని ఆయన తెలిపారు. 

తెలంగాణ సాధన తర్వాత రాష్ట్ర ప్రజల బేసిక్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకొంటూ ముందుకు పోతున్నామని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలు, కార్యక్రమాలపై  విపక్షాల విమర్శలపై చురకలంటిస్తూనే కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

also read:తెలంగాణకు ముందే మిషన్ కాకతీయకు రూపకల్పన: కేసీఆర్

ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొనడం సిగ్గుపడాల్సిన అంశంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి హరితహరం కార్యక్రమం కింద మొక్కల పెంపకాన్ని చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.   తాను ధైర్యంగా చెబుతున్నా తెలంగాణలో ఎవరూ కూడ ఉపవాసం ఉ:టలేరన్నారు. గతంలో మాదిరిగా ఆకలి చావులు లేనేలేవన్నారు. రూ. 2 కిలో బియ్యం పథకం తనకు చాలా నచ్చిన పథకంగా ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఈ పథకం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో  చాలా మంది ఆకలి తీరిందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios