KTR: నిరుద్యోగులతో మంత్రి కేటీఆర్.. డిసెంబర్ 3 న గుడ్ న్యూస్ !
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు నేడు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు చెందిన నిరుద్యోగ యువతతో కలిసి సంభాషించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఉదయమే వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతానని మంత్రి తెలిపారు.
KTR: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎలాగైనా సరే ఈ సారి జరిగే ఎన్నికల్లో విజయం సాధించి.. మూడోసారి అధికారం చేపట్టాలని అధికార బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. అదే సమయంలో ఎలాగైనా సీఎం కేసీఆర్ ను గద్దెదించి.. అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ లు వ్యూహరచనలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని రాజకీయా పార్టీలు విస్రుత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎలాగైనా.. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయస్తున్నాయి.
ఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు నిరుద్యోగ యువతతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో మంత్రి కేటీఆర్ .. నిరుద్యోగ యువతతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాల పైన మంత్రి నిరుద్యోగులతో విస్తృతంగా సంభాషించారు. ఈ క్రమంలో వారిపై హామీల వర్షం కురిపించారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఉదయం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో తాను ప్రత్యేకంగా సమావేశం అవుతానని, వారి సమస్యల గురించి చర్చిస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగ యువతను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ స్వార్ధ రాజకీయాలు చేస్తుందనీ, ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ అసత్య ప్రచారం నిర్వహిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ స్వార్థ పూరిత ప్రాపగాండాను తిప్పికొట్టి నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వివరాల జాబితా, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల వివరాలను నిరుద్యోగులకు అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల ప్రకటన చేసినప్పటికీ, నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వలన యువతలో కొంత ఆందోళన నెలకొందని తెలిపారు.
ఈ తరుణంలో ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపైన మంత్రి కేటీఆర్ నిరుద్యోగ యువతతో విస్తృతంగా మాట్లాడారు. అదేసమయంలో విద్యార్థుల సలహాలు, సూచనలకు సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ను వెంటనే చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి వివరించారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేనని ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరు ప్రశ్నించే అవకాశం లేదని, సంవత్సరానికి వేయి ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి ఆ అర్హతే లేదని తెలిపారు. తాము లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామనీ, ఇచ్చినా హామీకి రెట్టింపుగానే 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు.