Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్ఎంసీ ఎన్నికలు: రంగంలోకి కేటీఆర్.. నేతలతో సమాలోచనలు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, సీనియర్ నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాలోచనలు చేశారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు, సర్వేల ఆధారంగా చర్చలు కొనసాగాయి.

minister ktr meeting with trs leaders over ghmc elections ksp
Author
Hyderabad, First Published Nov 17, 2020, 9:34 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, సీనియర్ నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాలోచనలు చేశారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు, సర్వేల ఆధారంగా చర్చలు కొనసాగాయి.

పది మంది సీనియర్ నేతలతో గ్రేటర్ ఎన్నికల ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక 150 డివిజన్లకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు నిర్వహించారు.

మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీంతో పార్లమెంటరీ, శాసనసభపక్ష సమావేశాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్ లో నిర్వహించనుంది టీఆర్ఎస్.

Also Read:హరీష్ రావు ఖాతాలో దుబ్బాక ఓటమి: జిహెచ్ఎంసీ ఎన్నికలు కేటీఆర్ కు అగ్నిపరీక్ష

ఈ సమావేశానికి విధిగా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం దక్కకుండా చూడాలని పార్టీ నేతలకు కేసీఆర్  దిశానిర్ధేశం చేయనున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలను పలు డివిజన్లకు టీఆర్ఎస్ ఇంచార్జులుగా నియమించింది.ఇప్పటికే ఎమ్మెల్యేలను పలు డివిజన్లకు టీఆర్ఎస్ ఇంచార్జులుగా నియమించింది. అటు నగరంలోని పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలతో మంత్రి కేటీఆర్ విడి విడిగా సమావేశమౌతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios