ఓ జర్నలిస్ట్.. ట్విటర్ లో ‘గత కొంత కాలం క్రితం తండ్రి, ఇవాళ తల్లి అనారోగ్యంతో మరణించడంతో ఐదేళ్ల చిన్నారి అనాథగామారింది. ప్రభుత్వం స్పందించి ఈ చిన్నారి భవిష్యత్ బాధ్యతలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్ కు, నటుడు సోనూసూద్ కు, తెలంగాణ సీఎంవోలకు ట్యాగ్ చేశాడు. దీనికి మంత్రి KTR వెంటనే స్పందించారు. మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ ను నిర్మల్ కలెక్టర్ ట్వీట్ చేశారు. 

నిర్మల్ : పట్టణాభివృద్ధి, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నామంటూ ట్వీట్ చేస్తే చాలు ఆదుకునే కేటీఆర్ మరో చిన్నారికి బాసటగా నిలిచారు. తల్లీదండ్రి చనిపోయి అనాథగా మారిన చిన్నారిని ప్రభుత్వమే దత్తత తీసుకునేలా చేసి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెడితే.. 

‘రోషిణి నువ్వు చాలా హుషారుగా ఉన్నావు.. బాగా చదవాలి’.. అంటూ కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖి ఓ చిన్నారిని ప్రశంసించారు. ముధోల్ మండలం ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన భూమవ్వ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం చనిపోయింది. ఆమెకు భర్త కూడా లేకపోవడంతో కూతురు రోషిణి (5) అనాథలా మారింది. 

ఈ విషయాన్నిశ్రీకాంత్ గంటెపాక అనే జర్నలిస్ట్.. ట్విటర్ లో ‘గత కొంత కాలం క్రితం తండ్రి, ఇవాళ తల్లి అనారోగ్యంతో మరణించడంతో ఐదేళ్ల చిన్నారి అనాథగామారింది. ప్రభుత్వం స్పందించి ఈ చిన్నారి భవిష్యత్ బాధ్యతలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్ కు, నటుడు సోనూసూద్ కు, తెలంగాణ సీఎంవోలకు ట్యాగ్ చేశాడు. 

దీనికి మంత్రి KTR వెంటనే స్పందించారు. మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ ను నిర్మల్ కలెక్టర్ ట్వీట్ చేశారు. మంత్రి సూచన మేరకు బుధవారం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ Musharraf Ali Farooqi .. చిన్నారి Roshiniతో మాట్లాడారు.

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జ్..

నీ పేరేంటి అని ప్రశ్నించగా రోషిణి అని సమాధానమిచ్చింది. నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా.. అనగా బాల బడికి వెళుతున్నాను అని చెప్పింది. మీ 
Anganwadi టీచర్ ఎవరు.. అని ప్రశ్నించగా… ‘అగో ఆమెనే’ అని చూపించింది. అంగన్వాడి లో ఏం పెడుతున్నారు అని అడిగితే.. అన్నం, గుడ్లు అంటూ మెరుస్తున్న కళ్లతో.. చేతులు ఊపుతూ చెప్పగానే Collector ఒక్కసారిగా నవ్వారు. ఆ తరువాత రోషిణి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

శిశు సంరక్షణ అధికారులతో మాట్లాడి, రోషిణిని అదిలాబాద్ శిశు గృహానికి పంపించారు. గ్రామస్తులు, దాతల ద్వారా సేకరించిన రూ.1.80 లక్షల విరాళాన్ని ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసిల్దార్ శివ ప్రసాద్, సీడీపీవో శ్రీమతి పాల్గొన్నారు. 

ఈ విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చెప్పినవెంటనే స్పందించి చిన్నారిని ఆదుకున్న కలెక్టర్ ను అభినందించారు. 'many thanks collector garu' అంటూ ఆయన ట్వీట్ ను షేర్ చేసుకున్నారు.