Asianet News TeluguAsianet News Telugu

పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు మంత్రి కేటీఆర్ సహకారం..

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఆమె చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.
 

Minister KTR Helps Poor Student Anusha To Complete her MBBS
Author
Hyderabad, First Published Oct 7, 2021, 10:57 AM IST

ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మధ్యలో చదువు ఆపేసిన గిరిజన మహిళకు మంత్రి కేటీఆర్ సహకారం అందించారు. కరోనా పరిస్థితుల కారణంగా.. ఎంబీబీఎస్ చదవాల్సిన గిరిజన విద్యార్థిని అనూష.. తన తల్లితో కలిసి కూరగాయలు అమ్ముకుంటోంది. కాగా.. ఆమెకు సహకారం అందించడానికి కేటీఆర్ ముందుకొచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఆమె చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.

 అయితే కరోనా నేపద్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లి తో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్మెన్ గా పని చేస్తున్నారు. తన వైద్య విద్య కోర్సు  ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది. తన పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్గా, వైద్య విద్య పై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూష కి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. 

ఈరోజు ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు. అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని తెలిపిన కేటీఆర్, కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలన్నారు. ఈ సందర్భంగా అనూష కి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమె కు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios