Asianet News TeluguAsianet News Telugu

KTR: దేశభక్తి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు?.. బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్

సీఎం కేసీఆర్‌ను (CM KCR) ఉద్దేశించి తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వారి వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్.. దేశభక్తిపై (Desh Bhakti ) ధ్రువీకరణ పత్రాలిచ్చేందుకు ఈ మూర్ఖులెవరంటూ బీజపీ నేతలను ప్రశ్నించారు. 

Minister KTR Fires On Telangana BJP Leaders questions Who are these morons to issue certification on Desh Bhakti anyway
Author
Hyderabad, First Published Nov 22, 2021, 3:36 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశద్రోహి అని తెలంగాణ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా చేసిన పోరాటంలో చ‌నిపోయిన 750 మంది రైతు కుటుంబాల‌కు ఆర్థిక‌ సాయం చేస్తాన‌ని సీఎం కేసీఆర్ (KCR) ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను (CM KCR) ఉద్దేశించి తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వారి వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్.. దేశభక్తిపై (Desh Bhakti ) ధ్రువీకరణ పత్రాలిచ్చేందుకు ఈ మూర్ఖులెవరంటూ బీజపీ నేతలను ప్రశ్నించారు. 

కొవిడ్‌ సమయంలో, చలిలో ఏడాదిగా రైతులను వీధిపాలు చేసినవారు దేశభక్తులా అని ప్రశ్నించారు. అదే రైతులను ఆదుకున్నవారు దేశ ద్రోహలవుతారా..? అంటూ ఫైర్ అయ్యారు. దేశ భక్తిపై ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు..? అని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

అసలేం జరిగింది..
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నూతన సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకోవడంపై స్పందించిన సీఎం కేసీఆర్.. రైతు సంఘాల పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సాగు చట్టాలపై పోరులో వందలాది మంతి రైతులు ఆత్మార్పణం చేశారని.. ఒత్తిడికి లోనై, ఆరోగ్యం బాగాలేక ప్రాణాలు వదిలారని.. భారతప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేసీఆర్ కోరారు. తు ఉద్యమం వల్ల మరణించిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం.. రూ..22.5 కోట్లు దానికి ఖ‌ర్చు అవుతాయని చెప్పారు. రైతు నాయ‌కుల‌ను సంప్ర‌దించి.. ఆ కుటుంబాల‌కు అందించే ప్ర‌య‌త్నం చేస్తాం. కేంద్ర ప్ర‌భుత్వం కూడా బాధ్య‌త‌గా అమ‌రులైన రైతు కుటుంబాల‌ను ఆదుకోవాలని కోరారు. ప్ర‌తి కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల సాయం అందించాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలపై పోరాడిన రైతులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఎత్తివేయాలని  కోరారు. 

అయితే కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడిని బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌.. ఇటీవల కేసీఆర్ చైనా గురించి మాట్లాడుతూ సంబరపడ్డాడు.. ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమకారులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు. కేసీఆర్ దేశద్రోహి అయిపోయాడని.. ఆయనను ఫాలో కావద్దని అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios