తమ డివిజన్లకు నిధులు విడుదల చేయాలంటూ మంళగవారం బీజేపీ కార్పోరేటర్లు (bjp corporators) చేపట్టిన జీహెచ్ఎంసీ కార్యాలయం (ghmc office) ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

తమ డివిజన్లకు నిధులు విడుదల చేయాలంటూ మంళగవారం బీజేపీ కార్పోరేటర్లు (bjp corporators) చేపట్టిన జీహెచ్ఎంసీ కార్యాలయం (ghmc office) ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు తమను అడ్డుకోవడంతో రెచ్చిపోయిన కార్పోరేటర్లు కార్యాలయంలోకి దూసుకెళ్లి ఫర్నీచర్, ఫూలకుండీలు ధ్వంసం చేశారు. సీఎం కేసీఆర్ (kcr) ఫోటోలు తొలగించడంతో పాటు జీహెచ్ఎంసీ బోర్డుకు నల్లరంగు వేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

బీజేపీ కార్పొరేటర్లను గాడ్సే భక్తులంటూ సంబోధించిన కేటీఆర్.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హైదారాబాద్ పోలీస్ కమిషనర్‌ను (hyderabad police commissioner) కోరారు. మరోవైపు జీహెచ్ఎంసీ బోర్డుకు పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ కార్పోరేటర్లు. అనంతరం మేయర్ ఛాంబర్ వద్ద శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు వెల్లడించారు.

ALso Read:జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన.. 10 మంది బీజేపీ కార్పోరేటర్లపై కేసులు

కాగా.. ఈ ఘటనకు సంబంధించి జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 32మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాంనగర్, మూసరాంబాగ్, బేగంబజార్, ఆర్కేపురం, గన్ ఫౌండ్రీ తదితర డివిజన్ల కార్పోరేటర్లు ప్రమేయం ఉందని ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరప్రజల సమస్యలను పట్టించేకోవడం లేదని బిజెపి కార్పోరేటర్లు ఆరోపిస్తున్నారు. hyderabad నగరంలో ఇప్పటికే చేపట్టిన పలు అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్లకు మంజూరు చేయడంలేడని... దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కార్పోరేటర్లు ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్యలు తీసుకుని పరిష్కరించడంతో పాటు కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసారు. లేదంటే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని బిజెపి కార్పోరేటర్లు జిహెచ్ఎంసి పాలకవర్గాన్ని హెచ్చరించారు.

Scroll to load tweet…