Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన.. 10 మంది బీజేపీ కార్పోరేటర్లపై కేసులు

హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన బీజేపీ కార్పోరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫర్నీచర్, పూలకుండీలను కార్పోరేటర్లు ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటనకు బాధ్యులైన 10 మంది కార్పోరేటర్లపై కేసులు పెట్టారు. 
 

police filed cases on 10 bjp carporators over protest at ghmc office in hyderabad
Author
Hyderabad, First Published Nov 23, 2021, 9:16 PM IST

హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన బీజేపీ కార్పోరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫర్నీచర్, పూలకుండీలను కార్పోరేటర్లు ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటనకు బాధ్యులైన 10 మంది కార్పోరేటర్లపై కేసులు పెట్టారు. 

అంతకుముందు మంగళవారం జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి కార్యకర్తలు మేయర్ ఛాంబర్ లోకి దుసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని కార్యాలయ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, BJP Carporators కు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

GHMC జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగినట్లు  బిజెపి కార్పోరేటర్లు తెలిపారు. ఐదు నెలల క్రితం కరోనా కారణంగా పర్చువల్ గా నామమాత్రంగా మీటింగ్ జరిగిందని... ఆ మీటింగ్ లో చర్చించిన ఒక్క సమస్యకూడా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని తాము కోరుతుంటే ఎక్కడ తమ అవకతవకలు బయటపడతాయోనని భయపడే మేయర్, టీఆర్ఎస్ కార్పోరేటర్లు వెనకడుగు వేస్తున్నారని బిజెపి కార్పోరేటర్లు ఆరోపించారు.

ALso Read:బీజేపీ కార్పొరేటర్ల మెరుపు నిరసన... జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరప్రజల సమస్యలను పట్టించేకోవడం లేదని బిజెపి కార్పోరేటర్లు ఆరోపిస్తున్నారు. Hyderabad mayor gadwala vijayalakshmi కి వ్యతిరేకంగా బిజెపి కార్పోరేటర్లు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆమె కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బిజెపి కార్పోరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత సద్దుమణిగింది.

hyderabad నగరంలో ఇప్పటికే చేపట్టిన పలు అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్లకు మంజూరు చేయడంలేడని... దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కార్పోరేటర్లు ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్యలు తీసుకుని పరిష్కరించడంతో పాటు కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసారు. లేదంటే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని బిజెపి కార్పోరేటర్లు జిహెచ్ఎంసి పాలకవర్గాన్ని హెచ్చరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios