డిసెంబర్ 3న తెలంగాణ అంతా గులాబీమయం కాబోతుంది.. మంత్రి కేటీఆర్
డిసెంబర్ 3న తెలంగాణ అంతా గులాబీమయం కాబోతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
డిసెంబర్ 3న తెలంగాణ అంతా గులాబీమయం కాబోతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎంత స్థితప్రజ్ఞత ఉందనేది.. గత రెండు ఎన్నికల్లో రుజువైందని, ఈ సారి కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ది మరింత ముందుకు సాగాలంటే బీఆర్ఎస్‌తోనే సాధ్యమనేది ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ వెలువరించిన ‘‘కాంగ్రెస్ చేసిందేంది’’ అనే సంకలనాన్ని సోమవారం కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో.. ఏం చేయగలదో అంతా ప్రజలకు తెలుసునని చెప్పారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. డిసెంబర్ 3న తెలంగాణ అంతా గులాబీమయం కాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ అంటే తెలంగాణ స్వీయ అస్తిత్వానికి ఆత్మలాంటిదని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కేసీఆర్‌ను ప్రజలు గెలిపించుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణను ధ్వంసం చేసిందెవరో, పునర్నిర్మిస్తున్నదెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. ఎవరెన్ని టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. గోల్‌మాల్ కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరని చెప్పారు.