Asianet News TeluguAsianet News Telugu

UPSC Civils 2020 : కావలి మేఘనకు శాలువా కప్పి అభినందించిన కేటీఆర్

ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు. నేటి యువతరం మేఘనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు. 

minister ktr congratulations civils ranker meghana, telangana
Author
hyderabad, First Published Nov 27, 2021, 10:26 AM IST

హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2020 తుది పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘనను ఐటీ శాఖమంత్రి KTR అభినందించారు. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మేఘన తన తండ్రి టీఎస్ఎస్ పీడీసీఎల్ డైరెక్టర్ (కమర్షియల్) కె. రాములుతో శుక్రవారం ప్రగతిభవన్ కు వెళ్లి కేటీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు. నేటి యువతరం మేఘనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు. 

ఇదిలా ఉండగా, Civil services examsకు సిద్దమవుతున్న మహిళా అభ్యర్థులకు బిహార్ ప్రభుత్వం నవంబర్ 15న బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీస్‌కు చెందిన ప్రిలిమనరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జనరల్ కేటగిరీ మహిళా అభ్యర్థులకు లక్ష రూపాయలు ప్రోత్సహకంగా ఇస్తామని ప్రకటించింది. ప్రిలిమ్స్ సాధించిన అభ్యర్థులు ఈ మొత్తంతో మెయిన్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు ఉపయోగపడుతుందని బీహార్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. 

ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా శిశు అభివృద్ధి సంస్థ.. మహిళా అభ్యర్థులకు మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు ఈ మొత్తాన్ని అందజేస్తుందని ఒక అధికారి తెలిపారు. గతంలో సివిల్ సర్వీస్ ప్రోత్సాహక పథకాల కింద ఆర్థిక సహాయం పొందని మహిళలకు ఈ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు‌గా చెప్పారు. 

‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో బీహార్ మహిళల పనితీరును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 2021లో నిర్వహించిన UPSC or BPSC ప్రిలిమినరీ పరీక్షల్లో విజయం సాధించిన మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు’ అని డబ్ల్యుసిడిసి మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ బమ్హారా విలేకరులకు తెలిపారు.

‘గతంలో Scheduled Castes, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మిగిలిన మహిళా అభ్యర్థులకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. డిసెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం, మొత్తం లక్ష రూపాయలను చెల్లించడం జరుగుతుంది. తద్వారా మహిళా అభ్యర్థులు మెయిన్స్‌ ఎగ్జామ్‌కు సన్నద్ధమవుతున్నప్పుడు సమస్యలను ఎదుర్కొకుండా చూడవచ్చు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని అభ్యర్థి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది.’ అని ఆమె చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios